Karthika Deepam: ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. అంటూ వంటలక్క పాడుతుంటే ఆమెతో కూడా పాడారు అభిమానులు. ఆమె ఏడిస్తే ఏడ్చారు.. నవ్వితే నవ్వారు. ఆమెకు మగవారు కూడా ఫ్యాన్స్ గా మారిపోయారు. అది కార్తీక దీపం సీరియల్ కు ఉన్న పవర్. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత ఈ క్యారెక్టర్స్ ను ప్రజలు ఎప్పటికి మర్చిపోలేరు. అంతగా ప్రజల గుండెల్లో పెనవేసుకున్న సీరియల్ కార్తీక దీపం. దీప గా ప్రేమి విశ్వనాధ్, డాక్టర్ బాబుగా నిరుపమ్ నటించారు అనడం కన్నా జీవించారు అని చెప్పాలి. ఎన్నో ఏళ్ళు విజయవంతంగా సాగిన ఈ సీరియల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసింది. ఇక ఆ ముగింపు లో కూడా సీక్వెల్ ఉన్నట్లు ప్రకటించడంతో అభిమానులు సీజన్ 2 కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సీజన్ 2 పై నిరుపమ్ క్లారిటీ ఇచ్చాడు.
Naga Shaurya: ఆ హీరోయిన్ ఎవరో చెప్తే.. నా పెళ్ళాం నన్ను మాములుగా కొట్టద్దు
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిరుపమ్ మాట్లాడుతూ.. ” కార్తీక దీపం నా జీవితంలో మర్చిపోలేని సీరియల్. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా అభిమానులు నన్ను డాక్టర్ బాబు అనే పిలుస్తారు.. వంటలక్క గురించే అడుగుతారు. కార్తీక దీపం ఎందుకు అంత హిట్ అయ్యిందంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి భార్యాభర్తల మధ్య ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది. అందుకే ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయ్యారు. చాలాసార్లు నా భార్యతో ఉన్నా కూడా ప్రేక్షకులు దీప గురించే అడుగుతారు. తను అర్ధం చేసుకొని నవ్వుకుంటుంది. ఇక కార్తీక దీపం సీక్వెల్ ఉంటుంది అని నేను చెప్పలేను. నాకు తెలిసినంత వరకు ఉండదు. కార్తీక దీపం కథను తలదన్నేలా ఉంటేనే దానికి సీక్వెల్ తీయాలి.. లేకపోతే దాన్ని క్లాసిక్ సీరియల్ గానే వదిలేయాలి. లేకపోతే దానిపేరు చెడిపోతుంది. కావాలంటే.. దీప, నేను మరొక సీరియల్ తీయొచ్చు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.