NTV Telugu Site icon

Jigarthanda Double X: ఇండియన్ సినిమాని చూడబోతున్న హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్

Jigarthanda Double X

Jigarthanda Double X

కార్తీక్ సుబ్బరాజ్… కోలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. సినిమాని విజువల్ ఎక్స్పీరియన్స్ మార్చడంలో దిట్ట. సిల్లౌట్ షాట్స్, రెడ్ అండ్ బ్లాక్స్ ఎక్కువగా వాడుతూ ఇంటెన్సిటీని పెంచే ఏకైక తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. పిజ్జా, జిగర్తాండ, పేట సినిమాలతో కార్తీక్ సుబ్బరాజ్ తెలుగు ఆడియన్స్ కి కూడా బాగానే పరిచయం అయ్యాడు. ఇతని మేకింగ్ లో ట్రూ ఎసెన్స్ ఆఫ్ సినిమా ఉంటుంది అందుకే కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు చూడడానికి ప్యూర్ మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. టెక్నికల్లి బ్రిలియంట్ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, ఈ విషయంలో లాస్ట్ సీన్ వరకు కథ చెప్తూనే ఉండే కార్తీక్ సుబ్బరాజ్ టాప్ ప్లేస్ లో ఉంటాడు. ఇటీవలే ఈ జీనియస్ నుంచి జిగర్తాండ డబుల్ X సినిమా రిలీజ్ అయ్యింది. లారెన్స్, ఎస్ జే సూర్య హీరోలుగా నటించిన ఈ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఒక గొప్ప సినిమా అంటూ క్రిటిక్స్ నుంచి కూడా కాంప్లిమెంట్స్ అందుకుంది జిగర్తాండ డబుల్ X. కార్తీక్ సుబ్బరాజ్ స్టైల్ ఆఫ్ మేకింగ్, లీడ్ యాక్టర్స్ టెర్రఫిక్ పెర్ఫార్మెన్స్, సంతోష్ నారాయణ్ మ్యూజిక్, తిరు సినిమాటోగ్రఫీ జిగర్తాండ డబుల్ X సినిమాని అవుట్ స్టాండింగ్ గా నిలబెట్టాయి.

హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ అయిన క్లింట్ ఈస్ట్‌వుడ్ కి కార్తీక్ సుబ్బరాజ్ చాలా పెద్ద ఫ్యాన్. జిగర్తాండ డబుల్ X సినిమాలో క్లింట్ ఈస్ట్‌వుడ్ కి ట్రిబ్యూట్ ఇస్తూ కొన్ని సీన్స్ ని పెట్టాడు కార్తీక్ సుబ్బరాజ్. సినిమాని చూసిన మూవీ లవర్స్ అండ్ కార్తీక్ సుబ్బరాజ్ ఫ్యాన్స్… సోషల్ మీడియాలో క్లింట్ ఈస్ట్‌వుడ్ ని ట్యాగ్ చేసి “ఇండియా మీకు ట్రిబ్యూట్ ఇస్తూ మంచి సినిమాని తీశారు, మీరు వీలైతే జిగర్తాండ డబుల్ X సినిమాని చూడండి” అంటూ ట్వీట్స్ చేసారు. ఈ ట్వీట్స్ క్లింట్ ఈస్ట్‌వుడ్ వరకూ వెళ్లడంతో క్లింట్ ఈస్ట్‌వుడ్ టీమ్ రెస్పాండ్ అయ్యారు. “ప్రస్తుతం క్లింట్ ఈస్ట్‌వుడ్ ఆయన డైరెక్ట్ చేస్తున్న ‘జ్యురర్ 2’ సినిమా షూటింగ్ బిజీగా ఉన్నాడు. జిగర్తాండ డబుల్ X గురించి క్లింట్ ఈస్ట్‌వుడ్ కి తెలుసు. షూటింగ్ నుంచి ఫ్రీ అవ్వగానే సినిమా చూస్తారు” అంటూ రిప్లై వచ్చింది. తన అభిమాన దర్శకుడికి తాను చేసిన సినిమా గురించి తెలుసు, త్వరలో చూస్తాను అనడంతో కార్తీక్ సుబ్బరాజ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఒక మంచి ప్రయత్నం ఎంత దూరం తీసుకోని వెళ్తుంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ.