స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చిన మూవీ ‘అల వైకుంఠపురములో’. ఒక సింపుల్ ఫ్యామిలీ, ఫన్, ఎంటర్టైన్మెంట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అల వైకుంఠపురములో సినిమా అల్లు అర్జున్ ని హిట్ ట్రాక్ లోకి ఎక్కించింది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, బన్నీ ఫన్ టైమింగ్, తమన్ మ్యూజిక్, పూజా గ్లామర్ లాంటి ఎలిమెంట్స్ అల వైకుంఠపురములో సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచాయి. తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయిన ఈ మూవీని హిందీలో కార్తీక్ ఆర్యన్ హీరోగా ‘షెహజాదా’ అనే పేరుతో రీమేక్ చేశారు. నిన్న రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడ బిలో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. కార్తీక్ ఆర్యన్ ఫాన్స్ కి బాగానే నచ్చింది కానీ కామన్ ఆడియన్స్ మాత్రం షెహజాదా సినిమా బాగోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్ ఉండే హిట్ సినిమా స్క్రిప్ట్ కి యావరేజ్ అనే టాక్ కూడా రాకుండా ఫ్లాప్ అనే టాక్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మొదటి రోజే కేవలం 13% ఆకుపెన్సీ మాత్రమే ఉంది అంటే షెహజాదా సినిమాకి నెగటివ్ టాక్ ఎంత స్ప్రెడ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నెగటివ్ టాక్ కి కారణం, అల వైకుంఠపురములో సినిమా అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లు త్రివిక్రమ్ రాసిన ఒక పక్కా తెలుగు సినిమా. కొన్ని సినిమాలని రీమేక్ చెయ్యకూడదు అంటారు కదా, అల వైకుంఠపురములో అలాంటి సినిమానే. కథ బాగుండి హిట్ అయిన సినిమాని రీమేక్ ఏ బాషలో అయిన చెయ్యొచ్చు కానీ ఒక హీరో కోసం మాత్రమే రాసిన కథని రీమేక్ చెయ్యాలి అనుకోవడం ఇబ్బంది కలిగించే విషయమే. 96, రఘువరన్ Btech, హ్రిద్యం, లూసిఫర్, లవ్ టుడే, అసురన్ లాంటి సినిమాలు ఆ హీరోల కోసమే రాసినవి, ఆ హీరోలు క్యారెక్టర్స్ లో జీవించినవి… కాబట్టి ఇలాంటి సినిమాలని రీమేక్ చెయ్యకూడదు. ఈ విషయాన్ని ఫిల్మ్ మేకర్స్ అర్ధం చేసుకుంటే షెహజాదా లాంటి దెబ్బలు తగలకుండా ఉంటాయి.
