బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాంస్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ‘సత్య ప్రేమ్ కి కథ’. సాజిద్ నడియాద్ వాలా, నమః పిక్చర్స్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీలు ఇప్పటికే ‘భూల్ భులయ్య 2’ సినిమాలో కలిసి నటించి సూపర్ హిట్ కొట్టారు. హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న కార్తీక్ ఆర్యన్-కియారా అద్వానీ మరోసారి తమ మ్యాజిక్ ని చూపించారు. జూన్ 29న రిలీజ్ కానున్న సత్య ప్రేమ్ కి కథ సినిమా ప్రమోషన్స్ కి సాలిడ్ కిక్ ఇస్తూ మేకర్స్, ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ కార్డ్ వరకూ ట్రైలర్ గ్రాండ్ గా కనిపించింది. ఇది బాలీవుడ్ సినిమాల్లో ఎప్పుడూ ఉండేదేగా అనుకునే టైంలో కియారా అద్వానీ-కార్తీక్ ఆర్యన్ లు తమ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు.
ట్రైలర్ మొత్తం ఈ ఇద్దరే కనిపించి, మ్యాజిక్ క్రియేట్ చేసారు. సత్య ప్రేమ్ కి కథ ట్రైలర్ ని అద్భుతంగా మార్చింది, మ్యూజిక్. వాహ్ అసలు ఈమధ్య కాలంలో బాలీవుడ్ లో ఇలాంటి మ్యూజికల్ జర్నీలు చూడలేదు. పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం అంటే అన్నింటికన్నా ముందుగా మ్యూజిక్, సినిమాకి అండగా నిలవాలి. ఆ పనిని సక్సస్ ఫుల్ గా చేసారు మ్యూజిక్ డైరెక్టర్స్. ముఖ్యంగా ట్రైలర్ ఎండ్ లో కార్తీక్ ఆర్యన్ చెప్పిన… “నేను ఈ భూమిపైకి ఏ పనీ చేయడానికి రాలేదేమో, నిన్ను ప్రేమించడానికి తప్ప” అనే డైలాగ్ అండ్ ఆ టైంలో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్… లవ్ జానర్ అండ్ మ్యూజికల్ ఫిల్మ్స్ ని ఇష్టపడే వాళ్లకి బిగ్గెస్ట్ ట్రీట్ అనే చెప్పాలి. ట్రైలర్ తో సూపర్బ్ రివ్యూస్ అందుకున్న సత్య ప్రేమ్ కి కథ కాస్ట్ అండ్ క్రూ జూన్ 29న ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.
शायद मैं इस दुनिया में कुछ करने ही नहीं आया, सिवाय तुमसे प्यार… 🤍#SatyaPremKiKathaTrailer OUT NOW https://t.co/7EmilI3Bod #SajidNadiadwala #SatyaPremKiKatha #29thJune@advani_kiara @sameervidwans @shareenmantri @kishorarora19 @DoP_Bose @karandontsharma @NGEMovies…
— Kartik Aaryan (@TheAaryanKartik) June 5, 2023