NTV Telugu Site icon

Karthi: బ్రో అసలు నువ్వు హీరోనా, విలనా లేక కమెడియనా?

Karthi

Karthi

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని, కమర్షియల్ మీటర్ లో ఉండే సినిమాలని చేస్తూ తన మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్నాడు కార్తీ. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సౌత్ మొత్తం తన మార్కెట్ ని పెంచుకునే స్థాయికి ఎదిగాడు కార్తీ. తెలుగులో అయితే సూర్య కన్నా కార్తీ సినిమాలకి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. మన హీరోల రేంజులో ఓపెనింగ్స్ రాబట్టే కార్తీ ఖైదీ సినిమాతో మన ఆడియన్స్ ని మరింత దగ్గరయ్యాడు. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ తో కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన కార్తీ ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘జపాన్’. కార్తీ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని రాజా మురుగన్ డైరెక్ట్ చేస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. పుష్ప తర్వాత పాన్ ఇండియా చేస్తూ బిజీగా ఉన్న సునీల్, జపాన్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ తోనే కార్తీ మళ్లీ ఎదో కొత్త పాయింట్ తో సినిమా చేస్తున్నాడు అనే నమ్మకం కలిగించారు జపాన్ మూవీ మేకర్స్.

జపాన్, మెడ్ ఇన్ ఇండియా అనే క్యాప్షన్ తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి కార్తీ బర్త్ డే స్పెషల్ గా మేకర్స్ ఒక వీడియోని రిలీజ్ చేసారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జపాన్ ఇంట్రో అంటూ ఈ వీడియో బయటకి వచ్చింది. కార్తీ కర్లీ హెయిర్ తో, ఫుల్ గోల్డ్ ఆర్నమెంట్స్ తో కొత్త మేకోవర్ లో కనిపిస్తున్నాడు. ఈ గ్లిమ్ప్స్ లో హీరో క్యారెక్టర్ గురించి చెప్తూ… ఒక క్యారెక్టర్ ఏమో జపాన్ ని హీరో అంటుంది, ఇంకో క్యారెక్టర్ ఏమో విలన్ అంటుంది, మరో క్యారెక్టర్ ఏమో జపాన్ పెద్ద కమెడియన్ అంటుంది. గ్లిమ్ప్స్ ఓవరాల్ గా జపాన్ సినిమాపై మంచి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. జీవీ ప్రకాష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. ఇంతకీ అసలు జపాన్ ఎవరు? ఆ పేరు అతనికి ఎలా వచ్చింది? కామెడీ సినిమాగా కనిపిస్తున్నా గ్లిమ్ప్స్ మధ్యలో యాక్షన్ పార్ట్ ఎందుకు వచ్చింది? అనే విషయాలు తెలియాలి అంటే ఈ దీపావళి వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.