Site icon NTV Telugu

Karthi: WWE సూపర్ స్టార్ జాన్ సీన తో కార్తీ.. ఫోటో వైరల్

Karthi

Karthi

Karthi: చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడనివారు ఉంటారేమో కానీ, టీవీలో WWE చూడని వారు ఉండరు. ముఖ్యంగా WWE కార్డు గేమ్స్ ఆడనివారైతే ఉండరేమో. ఇక అందులో WWE సూపర్ స్టార్ జాన్ సీన గురించి తెలియని వారుండరు. WWE కి ఆయనే మెగాస్టార్ .. సూపర్ స్టార్. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్తున్నారు అంటే.. ఎన్నో ఏళ్ళ తరువాత జాన్ సీన్ ఇండియాలో అది హైదరాబాద్ లో సందడి చేశాడు. WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ ఈవెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలోనే జాన్ సీన ఆ ఈవెంట్ కు అటెండ్ అయ్యాడు. ఇక దీంతో ఎయిర్ పోర్టులోనే జాన్ సీన లవర్స్ హంగామా చేశారు. చాలా ఏళ్ళ తరువాత ఆయన ఇండియాలో అడుగుపెట్టడంతో పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Rajamouli: మొన్న మెగాస్టార్..ఇప్పుడు మెగా డైరెక్టర్.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’కి ఫిదా!

ఇక ఇదే ఈవెంట్ కు గెస్ట్ గా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ అటెండ్ అయ్యాడు. మొదటినుంచి కూడా కార్తీకి స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టమని అందరికీ తెల్సిందే.. ఇక తాజాగా ఈ ఈవెంట్ లో జాన్ సీనను కార్తీ కలిశాడు. ఆ ఫోటోను షేర్ చేస్తూ.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. “మిమ్మల్ని కలవడం చాలా అద్భుతంగా ఉంది జాన్ సీన. మీరు చూపించిన దయ, ప్రేమకు..థాంక్యూ.. చాలా అద్భుతంగా ఉంది.. కలిసిన కొద్దినిమిషాల్లోనే అందరితో మీరు ఇలా కలిసిపోయి మాట్లాడం.. ప్రేమగా పలకరించడం. హస్టిల్.. లాయల్టీ.. రెస్పెక్ట్.. అన్ని కనిపించాయి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version