గ్లామర్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఫేడవుట్ అవుతారో తెలియదు. ఒక్కోసారి 21 ఏళ్ల యంగ్ బ్యూటీ కూడా ఆఫర్స్ అందుకోలేక చతికిలపడుతుంది. కానీ, గత 21 ఏళ్లుగా కరీనా యమ స్పీడుగా దూసుకొస్తూనే ఉంది. ఇద్దరు బేబీస్ కి తల్లి అయినా ఆమెని ఇంకా బేబీ అనటానికే ఇష్టపడతారు కుర్రాళ్లు. అటువంటి ఎవర్ గ్రీన్ బేబో ఇప్పుడు మరో కొత్త బాధ్యత నెత్తిన వేసుకుంటోంది! యాక్టర్ కరీనా ప్రొడ్యూసర్ గా మారనుంది…
కరీనా నిర్మాతగా తొలి చిత్రం మరో డైనమిక్ లేడీ ప్రొడ్యూసర్ తో కలసి రూపొందించబోతోంది. బాలాజీ ఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ తో కరీనా కపూర్ చేతులు కలుపుతోంది. ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన హన్సల్ మెహతా దర్శకత్వం వహించనున్నాడు. అయితే, హన్సల్ రూపొందించే థ్రిల్లర్ మూవీ ఓ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కనుందట. సినిమా చాలా వరకూ యూకేలో షూట్ చేస్తారని సమాచారం.
హన్సల్ మెహతా సినిమాలు తాను చూశానని చెప్పిన బెబో ఆయన వర్క్ అంటే అభిమానమని వివరించింది. అందుకే, తొలిసారి హన్సల్ మెహతా డైరెక్షన్ లో నటించటం ఎగ్జైటింగ్ గా ఉందని పేర్కొంది. ఇక కరీనాతో పాటూ సంయుక్త నిర్మాతగా వ్యవహరించనున్న ఏక్తా కపూర్, ఆమెని డైనమైట్ కాంబినేషన్ అంటూ మెచ్చుకుంది. కరీనాలో స్టార్ పవర్, టాలెంట్ రెండూ ఉంటాయని పేర్కొంది. గతంలో ‘వీరే ది వెడ్డింగ్’ సినిమా కోసం కలసి పని చేసిన ఏక్తా, కరీనా ఇప్పుడు మరోసారి చేతులు కలపబోతున్నారు.
చూడాలి మరి, యాక్టర్ గా థ్రిల్లర్ మూవీలో కనిపించబోతోన్న కరీనా కపూర్ నిర్మాతగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అనుభవం మూటగట్టుకుంటుందో!
