Site icon NTV Telugu

Kareena Kapoor Khan: సైఫ్ పై దాడి ఇష్యూలో కరీనా పై రూమర్స్.. వారికి ఘాటుగా రిప్లై ఇచ్చిందిగా

Karina Kappor

Karina Kappor

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరగడం సంచలనంగా మారింది .తెల్లవారుజామున ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కత్తితో సైఫ్ అలీ ఖాన్‌ని గాయపరిచాడు. దీంతో సైఫ్ శరీరంపై ఆరో చోట్ల కత్తితో గాయాలయ్యాయి. వెన్నెముక పై, మెడపై తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి జరిగిన వెంటనే అతని నివాసం ఉన్న బాంద్రా నుంచి లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పారు. ఇక దాడి చేసిన నిందితుడిని బాంద్రాలోని హాలిడే కోర్టులో హాజరుపరచగా. న్యాయమూర్తి ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించడం జరిగింది. ఇక ఈ ఝటన కు సంబంధించిన ప్రతి చిన్న వార్త వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా సైఫ్‌ పై దాడి అనంతరం ఆయన సతీమణి కరీనాకపూర్‌ను తప్పుపడుతూ అనేక వార్తలు వైరల్ అయ్యాయి.

Also Read:Prabhas: ‘కల్కి 2898 ఎడి 2’ కి సర్వం సిద్ధం..నాగ్ అశ్విన్ నుండి ఎగ్జైటింగ్ అప్‌డెట్ 

సైఫ్ పై దాడి జరిగినప్పుడు కరీనా ఇంట్లో లేదని.. గాయాలతో ఇబ్బందిపడుతున్న ఆయనకు ఆమె ఏమాత్రం  పటించుకోలేదని మరికొందరు, ఇలా ఇష్టం వచ్చిన కామెంట్స్ చేశారు. దీంతో ‘వారు ఉన్న పరిస్థితి ఏంటి మీరు క్రియేట్ చేస్తున్న రూమర్స్ ఏంటీ’ అంటూ.. ఈ వార్తల పై బాలీవుడ్‌ స్టార్ అక్షయ్‌ కుమార్‌ సతీమణి,రచయిత ట్వింకిల్‌ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక వేగలేక తాజాగా ఈ మాటలపై కరీనా కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ‘ఒక మహిళ పై ఇలా మాట్లాడటం చాలా బాధాకరం. అదే విధంగా విరాట్‌ కోహ్లీ సరిగ్గా ఆడనప్పుడల్లా కొంతమంది ఆయన భార్య అనుష్క శర్మను నిందిస్తూ పోస్ట్ లు పెడుతూ ఉంటారు. ఇలాంటి వారిని ఏం చేయాలి ?’ అని ఆమె రాసుకొచ్చారు. ప్రజంట్ కరీనా మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version