తెలుగు భాష అంటే ఎంత చులకన అయిపోయిందో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇతర భాషల సినిమాలను ఏకకాలంలో తెలుగులో రిలీజ్ చేయాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే గత కొన్నాళ్లుగా తమిళ టైటిల్స్‌ని మరీ దారుణంగా అలాగే ఉంచి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కంగువా, తంగలాన్ అనేవి ఉదాహరణలు మాత్రమే. అలాంటి ఎన్నో పేర్లతో ఈ మధ్య తమిళ సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. పోనీలే, తమిళ సినీ దర్శక నిర్మాతలకు వారి భాష మీద ప్రేమ ఉంది అనుకోవచ్చు. తాజాగా రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ సినిమా టైటిల్‌తో పాటు ఆయన లుక్ కూడా రిలీజ్ చేశారు.
Also Read : Shiva 4K: నాగ్ మామ దిగుతుండు.. గెట్ రెడీ
అయితే అక్కడ ఆ సినిమా పేరు మరీ కామెడీ అయిపోయింది. అసలు విషయం ఏమిటంటే, కన్నడలో ‘ಕರಾವಳಿ’ (కరావళి) అంటే తీరం లేదా తీర ప్రాంతం అని అంటారు. అక్కడ జరిగే కథ కాబట్టి ఆ టైటిల్ పెట్టారు అనుకోవచ్చు. తెలుగులో రిలీజ్ చేస్తున్న వారు ఎంత అజాగ్రత్తగా ఉన్నారంటే, దాన్ని ‘కరవాలి’ అనే టైటిల్ ఫిక్స్ చేసి, అదే పేరుతో పోస్టర్లు కొట్టించి వదిలారు. తొలుత అనుమానం వచ్చిన వాళ్లు, అంత కాన్ఫిడెంట్‌గా రిలీజ్ చేశారు కాబట్టి అదే టైటిల్ నిజమని అనుకుని, తర్వాత రీసెర్చ్ చేస్తే అసలు విషయం ఇదని తేలింది. ఇకమీదట అయినా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే నవ్వుల పాలు కాక తప్పదు.
