NTV Telugu Site icon

Karate Kalyani : చేసిందే తప్పుడు పని.. హేమ భర్తను లాగుతూ కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్

Hema Vs Karate Kalyani

Hema Vs Karate Kalyani

Karate Kalyani Shocking Comments on Hema Regarding Rave Party: బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్న వ్యవహారం ఇప్పటికీ చర్చనీయాంశం అవుతూనే ఉంది. ఆమె పాల్గొనట్లు పోలీసులు పలు వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేస్తే ఆమె మాత్రం తాను పాల్గొనలేదు అన్నట్లుగా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. ఆ తర్వాత పోలీసులు సీరియస్ అయ్యి పాల్గొన్నందుకు ఒక కేసు, వీడియో రిలీజ్ చేసినందుకు మరో కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ తరుణంలో హేమ మీద మరో నటి కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు కామెంట్స్ చేసింది. హేమ గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తుంటే నాది ఆమెది కలిపి ఉన్న ఫోటోలు కూడా వచ్చాయని చెప్పుకొచ్చింది. ఇదేంట్రా అని చూస్తే ఆమె నన్ను కూడా పాయింట్ అవుట్ చేస్తూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఏ కరాటే కళ్యాణి పేక ఆడడం లేదా? అలా చేసింది ఇలా చేసింది అని కామెంట్ చేసింది. ఇప్పుడు ఈమె చేసింది ఏంటి? అని ఆమె ప్రశ్నించారు.

Simran Sister Death Mystery: 21 ఏళ్ల‌కే హీరోయిన్ సిమ్రాన్‌ చెల్లెలి సూసైడ్‌.. ఆ కొరియోగ్రాఫర్‌ వల్లే?

ఆవిడ ఫేక్ అని నేను ముందు నుంచే చెబుతున్నాను. అన్నిటినీ లింక్అప్ చేసి మరీ చూపిస్తున్నాను. ఆవిడ అన్నిట్లోనూ ఫేక్ గానే వచ్చి ఏవేవో మాట్లాడేసి నేను ఇండస్ట్రీ మొత్తాన్ని కాపాడేస్తున్నాను, కాపాడేస్తున్న మహా మహిళను నేను నన్ను తప్ప ఎవరూ దాటి వెళ్ళలేరు అన్నట్టుగా వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? ప్రతి ఒక్కరి మీద బురద వేశావు ఈరోజు నువ్వు చేసింది ఏంటి? అని కళ్యాణి ప్రశ్నించింది. అక్కడ డ్రగ్స్ దొరికాయి, రేవ్ పార్టీ అంటేనే చాలా దారుణమైన విషయం. అక్కడ వరస్ట్ ఫెలోస్ అందరూ ఉంటారు. తాగి, తిని, తిరిగి ఏం చేస్తారో నోటితో కూడా చెప్పలేని పనులు కూడా చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో కట్టడి చేశారు, నిఘా గట్టిగా ఉంది కాబట్టి మీరు బెంగళూరు వెళ్లారు. బెంగళూరులో పార్టీ చేశారు.

ఈవిడ కూడా అక్కడ దొరికింది. తప్పుడు ప్లేస్ లో దొరికే అందరి మీద బురద వేసి ఇప్పుడేంటి ఆవిడ బుకాయిస్తూ మాటలు చెబుతోంది. సారీ అండి నన్ను పిలిస్తే అక్కడికి వెళ్లాను అని ఒప్పుకుంటే అయిపోయేదానికి నేను మా ఇంట్లో వాళ్లకి ఫోన్ చేయడానికి అని ఫోన్ తీసుకుని అక్కడ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి మరో కేసు బుక్ అయ్యేలా చేసుకుంది. మా ఫామ్ హౌస్ ఇది అంటుంది, నీకు ఎక్కడ ఉంది ఫామ్ హౌస్? మీ ఫామ్ హౌస్ అయితే మీ ఆయన కూడా పక్కనే ఉండాలి కదా. మరి ఆ భర్తను ఎందుకు చూపించలేదు? అని ప్రశ్నించింది. అది చూపించకుండా ఫోన్లో వీడియో రికార్డ్ చేసి అటు పోలీసులను, ఇటు మీడియాను తప్పుదోవ పట్టించావు అందుకే ఇప్పుడు ఇంకో కేసు కూడా మీద పడింది అంటూ కళ్యాణి కామెంట్ చేసింది.