వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందిన ‘హృదయం’ చిత్రంలో ప్రణవ్ మోహన్‌లాల్ , కళ్యాణి ప్రియదర్శన్ , దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాగా, డీసెంట్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాతో ప్రణవ్ కు మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ లభించింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా సోషల్ మీడియాతో పాటు అన్ని భాషల్లోని మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించింది. ఇంకేముంది సినిమాను పలు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బడా నిర్మాత ‘హృదయం’ సినిమా రైట్స్ ను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు.
Read Also : RRR : నందమూరి అభిమానుల సందడి… లారీలో థియేటర్ కు…
”ఈ వార్తను మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా మరియు గౌరవంగా ఉంది. ధర్మ ప్రొడక్షన్స్ & ఫాక్స్ స్టార్ స్టూడియోస్ మలయాళ ప్రేమకథ హృదయం హిందీ, తమిళం, తెలుగు భాషల రైట్స్ ను పొందాయి. ఈ భారీ విజయానికి @visakhsubramaniam & @cinemasmerryland ధన్యవాదాలు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. @apoorva1972 @dharmamovies @foxstarhindi #FoxStarStudios” అని వెల్లడించారు. ఈ పోస్ట్ చూస్తుంటే కరణ్ జోహార్ స్వయంగా ‘హృదయం’ సినిమాను ఇతర భాషల్లో నిర్మించే పనుల్లో ఉన్నట్టుగా అన్పిస్తోంది. కరణ్ ప్రస్తుతం రణవీర్ సింగ్, అలియా భట్‌లతో కలిసి ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కూడా నటించనున్నారు.
