Site icon NTV Telugu

Kapunadu: బాలయ్య, టీడీపీలకు కాపునాడు అల్టిమేటం

Kapunadu Ultimatum To Balay

Kapunadu Ultimatum To Balay

Kapunadu Ultimatum To Balakrishna And TDP: నందమూరి బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీకి కాపునాడు అల్టిమేటం జారీ చేసింది. స్వర్గీయ ఎస్వీ రంగారావును ఉద్దేశించి బాలయ్య ‘‘ఆ రంగారావు, ఈ రంగారావు’’ అంటూ చేసిన వ్యాఖ్యలను కాపు సామాజిక వర్గం కాపునాడు తీవ్రంగా పరిగణించింది. గతంలో కూడా రాజకీయాల్లో చిరంజీవి విఫలమయ్యారని, రాజకీయాల్లో విజయం తమకే సాధ్యమంటూ ‘‘మా బ్లడ్డు వేరు, మా బ్రీడు వేరు’’ అన్న మాటలు సైతం కాపుల మనోభావాల్ని దెబ్బతీశాయి. జనసేన పార్టీలో తిరిగే వారందరూ.. అలగాజనం అని, సంకరజాతి జనం అని అన్న మాటలు కాపుల గుండెల్లో గునపాలు దింపాయన్నారు. బాలయ్య చేసిన ఆ వ్యాఖ్యలప 25వ తేదీ సాయంత్రంలోపు మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలని కాపునాడు డిమాండ్ చేసింది. ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే.. రాష్ట్రంలో ఉన్న వంగవీటి రంగారావు విగ్రహాల వద్ద కాపు సోదరులందరూ ప్లాకార్డులు ప్రదర్శించి, మౌన నిరసన తెలపాలని కాపునాడు పిలుపునిచ్చాడు.

KTR: మంత్రి నోట ఆసక్తికరమైన మాట.. మోడీ దేవుడు ఎందుకయ్యాడు ?

గతంలో దేవబ్రాహ్మణులకి సంతకం లేని లేఖ విడుదల చేసినట్టు కాకుండా.. స్వయంగా ప్రెస్మీట్ పెట్టి, సదరు వ్యాఖ్యలు చేసినందుకు గాను క్షమాపణ కోరాలని బాలయ్యని కాపునాడు డిమాండ్ చేసింది. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయనని హామీ ఇవ్వాలని.. లేకపోతే తెలుగు రాష్ట్రాలలో వంగవీటి మోహనరంగా విగ్రహాల వద్ద నిరసన చేపడుతాడమని పేర్కొంది. అలాగే.. తెలుగుదేశం పార్టీ నుండి బాలయ్యని పది సంవత్సరాల పాటు బహష్కరించాలని కాపునాడు కోరింది. ఈ షరతుకి టీడీపీ తలొగ్గకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేష్ పాదయాత్రని కాపు సామాజిక వర్గం అడ్డుకుంటుందని హెచ్చరించింది. కాగా.. వీరసింహారెడ్డి సక్సెస్‌మీట్‌లో భాగంగా బాలయ్య చేసిన ‘ఆ రంగారావు, ఈ రంగారావు.. అక్కినేని తొక్కినేని’’ అనే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య, అఖిల్ అక్కినేని సోషల్ మీడియా మాధ్యమంగా బాలయ్యపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Prabhas: ప్రభాస్, హృతిక్ కాంబో కన్ఫమ్.. కానీ ఓ చిన్న మెలిక?

Exit mobile version