NTV Telugu Site icon

Kantara: భూతకోల అరుపు ఇంకా వినిపిస్తూనే ఉంది…

Kantara

Kantara

ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ ని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసింది KGF ఫ్రాంచైజ్. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన హోంబెల్ నుంచి వచ్చిన నెక్స్ట్ మూవీ ‘కాంతార’. రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ మూవీ ముందుగా కన్నడలో మాత్రమే రిలీజ్ అయ్యింది. కన్నడలో సూపర్ హిట్ టాక్ రావడంతో కాంతార సినిమా వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అయ్యి పాన్ ఇండియా మొత్తం హిట్ అయ్యింది. కేవలం 16 కోట్ల బడ్జట్ తో రూపొందిన కాంతార సినిమా ఇండియా వైడ్ ఓవరాల్ గా 450 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. వరాహ రూపం సాంగ్, రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాంతార సినిమా థియేట్రికల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఒటీటీలో కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే గతేడాది సెప్టెంబర్ లో రిలీజ్ అయిన కాంతార మూవీ చేసిన సౌండ్ ఇన్ని నెలలు అయినా ఇంకా వినిపిస్తూనే ఉంది.

ఇప్పటివరకూ ఇండియాలో మాత్రమే వినిపించిన భూతకోల శబ్దం ఇప్పుడు పాన్ వరల్డ్ కి స్ప్రెడ్ అవుతోంది. ఇటివలే ‘జెనీవ’లో కాంతార స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. హ్యుజ్ రెస్పాన్స్ రాబట్టిన కాంతార సినిమాని ఇటలీ నుంచి వస్తున్న భారి డిమాండ్ కారణంగా ఇటలీ అండ్ స్పానిష్ లాంగ్వేజస్ లో డబ్ చేస్తున్నారు. కాంతార సినిమాని ఇటలీ, స్పానిష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు రిషబ్ శెట్టి అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. kgf ఫ్రాంచైజ్ కన్నడ సినిమాని పాన్ ఇండియాకి పరిచయం చేస్తుంటే కాంతార సినిమా KFIని పాన్ వరల్డ్ కి పరిచయం చెయ్యడానికి రెడీ అయ్యింది. కాంతార సినిమాకి ప్రీక్వెల్ వస్తుందని ఆల్రెడీ మేకర్స్ అనౌన్స్ చేశారు కాబట్టి ఆ మూవీ లార్జ్ స్కేల్ లో రూపొందే అవకాశం ఉంది.