NTV Telugu Site icon

Prabhas: రెబల్ స్టార్ కోసం రంగంలోకి దిగిన కాంతార స్టార్…

Prabhas

Prabhas

ప్రభాస్ భారి బడ్జట్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా జోష్ లో ఉన్న ప్రభాస్, మారుతీ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ ని సైలెంట్‌గా కంప్లీట్ చేస్తున్నాడు. అసలు అనౌన్స్మెంట్ లేకుండానే ఈ సినిమా షూటింగ్ మొదలైంది, బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని జరుపుకుంటూ ఉంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ మారుతితో సినిమా చేయడం ఏంటి? అనే డిస్కషన్స్ ని పట్టించుకోకుండా ప్రభాస్ సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె లాంటి పాన్ ఇండియా సినిమాల మధ్య… జస్ట్ చేంజ్ ఓవర్ కోసం సరదాగా ఈ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇక డార్లింగ్ ఎలాగు ఫిక్స్ అయిపోయాడు కాబట్టి ఫ్యాన్స్ కూడా మారుతిని యాక్సెప్ట్ చేసేశారు. ఈ సినిమా నుంచి లీక్ అయిన ఫోటోల్లో ప్రభాస్ లుక్ ని చూసి మారుతి పై నమ్మకం పెంచేసుకుంటున్నారు అభిమానులు.

Read Also: Rachakonda Crime: రాచకొండ పరిధిలో దారుణం.. వ్యక్తి పై ఇనుప రాడ్డులతో కత్తులతో దాడి

ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే మాళవిక మోహనన్‌, రిద్దికుమార్ ఫైనల్ అయిపోయారు. అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనే ఇప్పుడో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడని గతంలోనే వార్తలొచ్చాయి. దాంతో తమన్ దాదాపుగా లాక్ అయిపోయాడని అనుకున్నారు కానీ ఇప్పుడు తమన్ ప్లేస్‌లో కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్‌ను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. కాంతార సినిమాను నిలబెట్టడంలో అజనీష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలిచింది. ఇదే కాదు రీసెంట్‌గా వచ్చిన విరూపాక్ష సినిమాకు కూడా అదిరిపోయే బీజిఎం ఇచ్చాడు అజనీష్. దీంతో ప్రభాస్ ఈ మ్యూజిక్ టాలెంట్‌ను తీసుకోవాలని మారుతికి సూచించినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రభాస్ సినిమాకి ఒక సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పక్కాగా వినిపిస్తుంది.

Read Also: CM JaganMohan Reddy: కావలిలో సీఎం జగన్ పర్యటన.. చుక్కల భూములకు పట్టాల పంపిణీ

Show comments