కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న కాంతార: చాప్టర్ 1 అక్టోబర్ 2న భారీ ఎత్తున విడుదల కానుంది. బ్లాక్‌బస్టర్ కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని పాన్–ఇండియా రేంజ్‌లో వరల్డ్‌వైడ్ రిలీజ్‌కి సిద్దం అవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న తరుణంలో, నార్త్‌లో థియేటర్ల కేటాయింపులపై చర్చ మొదలైంది. అదే రోజు బాలీవుడ్ మూవీ ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’ కూడా విడుదల కావడంతో, రెండు సినిమాల మేకర్స్ మధ్య స్క్రీన్ల షేరింగ్‌పై వివాదం నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read : Shefali Jariwala: షెఫాలీ చనిపోయిన రోజు.. ఏం జరిగిందో నిజం బయటపెట్టిన భర్త పరాగ్
సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం – కాంతార మేకర్స్ తమ సినిమాకు మాత్రమే ఎక్కువ స్క్రీన్లు ఇవ్వాలని, బాలీవుడ్ మూవీకే షోలు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారట. దీనిపై నార్త్ నెటిజన్లు స్పందిస్తూ –“ఇలా స్క్రీన్స్ మొత్తం ఆక్రమించుకోవడం సరికాదు.” “షేరింగ్ ఉంటేనే హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది.” “100% స్క్రీన్స్ అడగడం ఎలా సాధ్యం?” అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు – “కాంతారలాంటి పాన్ ఇండియా మూవీ తో పోటీ ఎందుకు? బాలీవుడ్ మూవీ మేకర్స్ మరో డేట్ ఎంచుకుంటే బెటర్” అని సూచిస్తున్నారు. అయితే ఈ వార్తలు నిజమో కాదో అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కాంతార ప్రీక్వెల్ vs బాలీవుడ్ రిలీజ్ హాట్ టాపిక్‌గా మారింది.
