kantara : రిషబ్ శెట్టి ‘కాంతార’ మూవీ టీంకు బిగ్ షాక్..
- రిషబ్ శెట్టి దర్శకత్వంలో వస్తోన్న కాంతార ప్రీక్వెల్
- పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయితీ
- భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏళ్ళు గడిచిన కొన్ని చిత్రాలు గుర్తుండి పోతాయి. అలాంటి వాటిలో ‘కాంతార’ ఒకటి. తెలిసిన కథే కావచ్చు.. కానీ ఆ కథని ఎంతో కొత్తగా చూపించాడు దర్శకుడు రిషబ్ శెట్టి. అందుకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. ప్రస్తుతం ఈ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి పార్ట్ లో మనకు చాలా డౌట్ ఉండిపోయాయి.. రిషబ్ తండ్రి గురించి, ఆయన చనిపోవడం, ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ మొదలయ్యింది, దేవుడు ప్రత్యేకంగా ఒక తెగ వాళ్లకి ఎందుకు పూనుతాడు.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనలో ఉన్నాయి. ఇక వాటనికి సమాధానం ఈ ప్రీక్వెల్‌లో చూపించబోతున్నాడట రిషబ్.
ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ షూట్ కి సంబంధించి వార్త ఒకటి వైరల్ అవుతుంది. ఏంటంటే ప్రస్తుతం ఈ మూవీ షూట్ కర్ణాటకలోని గవి గుడ్డ, హేరూరు అటవీ ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే గ్రామ శివారులోని ఖాళీ మైదానాల్లో మాత్రమే షూట్ చేసుకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారట. కానీ చిత్రబృందం మాత్రం అక్రమంగా అటవీ ప్రాంతంలో షూట్ చేస్తుందట, అంతేకాకుండా పేలుడు పదార్థాలు కూడా ఉపయోగిస్తున్నరట.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
దీంతో గ్రామ స్థానికులు షూటింగ్ మూలంగా అటవీ ప్రాంతంలో ఉండే మూగ జీవులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చిత్ర బృందాన్ని సంప్రదించి మందలించారట. అలా వారి ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో, గ్రామానికి చెందిన ఓ యువకుడిపై చిత్రబృందం దాడి చేసిందంట. దీంతో స్థానికులంతా పోలీసులను ఆశ్రయించారు. యెసలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. దీనిపై పోలిసులు త్వరగా స్పందించి, చర్యలు తీసుకోకపోతే తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని స్థానికులు తెలిపారట.
- Tags
- Kantara2
- rishab shetty
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!