కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టీ (Rishab Shetty) హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’పై భారీ అంచనాలు ఉన్నాయి. 2022 లో సంచలనం సృష్టించిన ‘కాంతార’.. రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కాగా ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’ రాబోతోంది. అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. మొదటి భాగం కన్నడలో విడుదలై హిట్‌గా నిలిచిన తర్వాత ఇతర భాషల్లో డబ్ చేయబడింది. అయితే ఈ సారి ప్రీక్వెల్‌ను అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఆ కథ ఎక్కడి నుంచి మొదలైందో, దానికి ముందు జరిగిన సంఘటనలను ఈ ‘కాంతార చాప్టర్ 1’ లో చూపించనున్నారు. ముఖ్యంగా పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా స్టంట్ కొరియోగ్రాఫర్ అర్జున్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
Also Read : #SSMB29 : 120 దేశాల్లో విడుదలకు ప్లాన్.. రాజమౌళి కొత్త రికార్డు
‘‘సినిమాలోని యాక్షన్ సన్నివేశాలన్నింటినీ రిషబ్ స్వయంగా చేశారు, ఒక్క చోట కూడా డూప్ వాడలేదని తెలిపారు. కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీతో పాటు యుద్ధకళ కలరిపయట్టులోనూ శిక్షణ తీసుకుని, అద్భుతమైన ఫైట్లు చేశారని ఆయన చెప్పారు. “నేను చాలా మంది నటులతో వర్క్ చేశా కానీ రిషబ్‌లాంటి హీరో ఎవరూ లేరు. ‘నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను’ అనడమే కాదు.. ‘నేను బ్రతికి ఉన్నంత వరకు చేస్తాను’ అని చెబుతాడు. ఆయన నిజంగా స్ఫూర్తిదాయకం” అంటూ అర్జున్ రాజ్ రిషబ్‌ను ప్రశంసించారు. రిషబ్ శెట్టీ చేసిన రిస్కీ స్టంట్స్‌తో సినిమా బజ్ మరింత పెరిగిపోయింది.
