రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘కాంతార చాప్టర్ 1’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో నుండే మంచి స్పందనను సొంతం చేసుకుంది. బుక్ మై షో ప్రకారం, ఇప్పటికే కోటి టికెట్లు 11 రోజుల్లో అమ్ముడైపోయాయి. 11 రోజుల్లో ఈ స్థాయిలో టికెట్లు అమ్ముడు అవ్వడం అరుదని సంస్థ తెలిపింది. ఇలా ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పటి వరకు రూ.500 కోట్ల క్లబ్‌లో చేరి, భారతీయ సినిమా పరిశ్రమలో అరుదైన ఘనత సాధించింది. అయితే సినిమా విడుదలైన తర్వాత ప్రతి ఒక సీన్ బాగున్నప్పటికీ.. చాలా మంది క్లైమాక్స్ సన్నివేశాలపై ప్రశంసలు కురిపిస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే తాజాగా, క్లైమాక్స్ షూట్ సమయంలో తాను ఎంత కష్టపడ్డాడో వివరించడానికి రిషబ్ కొన్ని ఫోటోలు పంచుకున్నారు.
Also Read : Rowdy Janardhan : గ్రామీణ నేపథ్యంతో, ఫాదర్ సెంటిమెంట్ ఫుల్..!
రిషబ్ తెలిపిన వివరాల ప్రకారం, ‘క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో తీసిన ఫొటోలు ఇవి. సినిమా విడుదలైన తర్వాత ఈ సన్నివేశాలపై అందరూ మాట్లాడుతున్నారు. ఈ విజయం వెనుక ఎంతో శ్రమ ఉంది. వాచిపోయిన కాళ్లు, అలసిన శరీరం ఈ కష్టమే ప్రేక్షకుల ఆరాధన కోసం. ఇది మాకు నమ్మిన దైవిక శక్తి మరియు ఆది ఆశీర్వాదం వల్ల సాధ్యమైందని చెబుతాం’ అని రిషబ్ తెలిపారు. అంతేకాక, రిషబ్ అభిమానులు, ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ‘‘మాపై చూపుతున్న మద్దతు, ప్రేమ, ఆదరణ చాలా ప్రత్యేకం. ఇది సినిమాకు మాత్రమే కాదు, మా కృషికి మించిన ప్రేరణ’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
