Kannappa : కన్నప్ప ఓవర్సీస్ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. కన్నప్పపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా కోసం భారీగా ఖర్చుపెట్టాడు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ వంటి స్టార్స్ ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. భారీ అంచనాల మధ్య నేడు థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది. మరి అక్కడి టాక్ ఎలా ఉందంటే..
శివుడు మరియు పార్వతిగా నటించిన అక్షయ్ కుమార్, కాజల్ తో స్టార్ట్ అయిన సినిమా మొదటి భాగం అంతా తిన్నడు (మంచు విష్ణు) బ్యాక్ స్టోరీ, నాస్తికుడిగా ఇతర తెగలపై పోరాటాలు చేయడం వంటి అంశాలతో సాగుతుంది. అయితే తిన్నడి ప్రేమకథలో రొమాంటిక్ ట్రాక్, అనవసరమైన యాక్షన్ సన్నివేశాలు, కథనం మరి నిదానంగా సాగుతుండడం ఇబ్బంది పెట్టింది. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా సాగింది. ఇక సెకండ్ హాఫ్ కాస్త రిలీఫ్. చివరి 40 నిమిషాలు రుద్ర పాత్రలో ప్రభాస్ ఎంట్రీ తర్వాత వచ్చిన హై చివరి వరకు నిలబెట్టగలిగాడు దర్శకుడు. ఇంతకీ నీకు పెళ్లిఅయిందా అని ప్రభాస్ ని అడగడం.. నా పెళ్లి గురించి ఎందుకులే అని బదులివ్వడం వంటి డైలాగ్స్ ఫ్యాన్స్ తో విజిల్ కొట్టించాయి. క్లైమాక్స్ లో మంచు విష్ణు నటన సూపర్బ్. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీని ఒకే. నేపథ్య సంగీతం బిగ్ ప్లస్. కానీ VFX అక్కడక్కడా నాసిరకంగా ఉన్నాయి. రైటింగ్ కూడా ఇంకా బాగుండాల్సింది. మోహన్ లాల్, మోహన్ బాబు మెప్పించారు. ఓవరాల్ కృషంరాజు కన్నప్ప అంత కాదు కానీ ఓ సారి చూడగలిగేలా ఉందని ఓవర్సీస్ నుండి వస్తున్న టాక్.
Also Read
తాజావార్తలు
-
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
-
Anil Ravipudi: త్రివిక్రమ్‌ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేశాడా?
-
Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
-
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఎన్టీఆర్!
-
Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!