మంచు విష్ణు హీరోగా, ప్రభాస్, మోహన్‌లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ వంటి వారు కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం కన్నప్ప. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడినప్పటికీ, ఎట్టకేలకు జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, సినిమా విడుదలకు కొద్ది గంటల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచు విష్ణు టీమ్‌కు శుభవార్త చెప్పింది.
Also Read: Raashi Khanna : టాప్ లెస్ ట్రీట్ ఇస్తున్న రాశిఖన్నా..
ఈ సినిమాకు సంబంధించిన టికెట్ ధరలను ఆంధ్రప్రదేశ్‌లో పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఒక ప్రత్యేక జీవో జారీ అయింది. ఆ జీవో ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరను 206.50 రూపాయల వరకు, మల్టీప్లెక్స్‌లలో 236 రూపాయల వరకు పెంచుకునే సౌలభ్యం కల్పించారు.
Also Read: Drugs Case : డ్రగ్స్ కేసులో ట్విస్ట్…నాకు సంబంధం లేదంటున్న నటుడు!
ఈ సినిమాను హిందీలో రామాయణం సీరియల్‌లో కొన్ని ఎపిసోడ్‌లకు దర్శకుడిగా వ్యవహరించిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. సినిమాను మంచు మోహన్ బాబు నిర్మిస్తూనే, ఇందులో మహాదేవ శాస్త్రి అనే పాత్రలో నటించారు. ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలో ప్రభాస్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ప్రభాస్ పాత్ర గురించి సినిమా టీమ్ కూడా ఎక్కువగా చెబుతోంది. దీంతో, ప్రభాస్ కోసమైనా సినిమా చూడాలని నిశ్చయించుకున్నవారు చాలామంది ఉన్నారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించారు, తెలంగాణలో మాత్రం ఈ అవకాశం ఇవ్వలేదు.
