Sampath: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కన్నడ బుల్లితెర నటుడు సంపత్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. సంపత్ జె రామ్ వయస్సు 35. చిన్నతనం నుంచి హీరో అవ్వాలని కలలు కని ఎన్నో కష్టాలు పడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. కన్నడలో అగ్నిసాక్షి అనే సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. అగ్నిసాక్షి సంపత్ అనే ఆయనను పిలిచేవారు. అయితే గత కొన్నిరోజులుగా తనకు అవకాశాలు రావడం లేదనే విషయంలో డిప్రెషన్ కు గురైనట్లు సమాచారం. ఆ డిప్రెషన్ లోనే సంపత్ బెంగుళూరులోని తన నివాసంలో శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Akhil Akkineni: ఆ హీరోయిన్ ను సెట్ లో వేధించిన అఖిల్.. నిజమేంటి ?
ఇక సంపత్ మృతి పట్ల ఆయన సహనటుడు రాజేష్ ధృవ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాడు. ఆయనతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. “నువ్వు ఇంకా చాలా సినిమాలు చేయాలి.. ఇంకా మంచి గుర్తింపును తెచ్చుకోవాలి. చాలా పోరాటం మిగిలి ఉంది. నీ కలల్ని సాకారం చేసుకోవాలి.. వెనక్కి తిరిగి రా” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల అసలు కారణాలను వెలికితీసే పనిలో పడ్డారు. ఇక అతి చిన్న వయస్సులోనే ఆయన మృతి చెందడం పట్ల పలువురు బుల్లితెర నటులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.