Site icon NTV Telugu

Shivanna: ఆయన మాస్ ఏంటో తెలియాలి అంటే ఈ సినిమాలు చూడాలి…

Shivanna

Shivanna

సూపర్ స్టార్ రజినీకాంత్ కంబ్యాక్ హిట్ గా నిలుస్తూ జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది. తలైవర్ ఫ్యాన్స్ థియేటర్స్ లో చేస్తున్న హంగామాకి కలెక్షన్ల వర్షం కురుస్తుంది. జైలర్ సినిమాలో రజినీకాంత్ కి హెల్ప్ అయ్యే రెండు మేజర్ ఇంపార్టెంట్ రోల్స్ ని మోహన్ లాల్ అండ్ శివ రాజ్ కుమార్ ప్లే చేసారు. ఈ ఇద్దరూ వాళ్ల వాళ్ల ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్లే. కేవలం రజినీకాంత్ కోసమే చిన్న క్యామియో అయినా కూడా ప్లే చేయడానికి మోహన్ లాల్ అండ్ శివ రాజ్ కుమార్ లు ఓకే చెప్పారు. మాథ్యూగా మోహన్ లాల్, నరసింహగా శివన్న నటించారు. క్లైమాక్స్ లో శివన్న, మోహన్ లాల్, రజినీకాంత్ ల పైన డిజైన్ చేసిన సీన్ కి థియేటర్స్ లో విజిల్స్ పడుతున్నాయి. ముఖ్యంగా శివన్న స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. పంచె కట్టులో ఊర మాస్ గా కనిపించిన శివన్న పేరు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతోంది.

ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా శివన్న కేవలం తన లుక్స్ తో ఈ రేంజ్ ర్యాంపేజ్ ని సృష్టించాడు. శివన్న స్క్రీన్ ప్రెజెన్స్ ని మరింత ఎలివేట్ చేస్తూ అనిరుద్ ఇచ్చిన ‘హుకుమ్’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూనకాలు తెచ్చేలా ఉంది. దీంతో గత 24 గంటలుగా సోషల్ మీడియాలో శివన్న పేరు మారుమోగుతోంది. కన్నడ సూపర్ స్టార్ శివన్న రేంజ్, ఆయన మాస్ ఏంటో తెలియాలి అంటే “ఓం, మఫ్టీ, టగరు” సినిమాలు చూడాల్సిందే. ఈ మూవీ సినిమాల్లో శివన్న డైలాగులు తక్కువగా చెప్తూ జస్ట్ కంటి చూపుతోనే విలన్స్ ని భయపెడుతూ ఉంటాడు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వీరప్పన్ సినిమాలో కూడా శివన్న మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒకసారి ఈ సినిమాలని చూస్తే ఎవరైనా సరే శివన్నకి ఫ్యాన్ అయిపోతారు.

Exit mobile version