NTV Telugu Site icon

Hanuman: ఇండియన్ సూపర్ హీరో సినిమాని చూడబోతున్న భజరంగీ…

Hanumanaa

Hanumanaa

ఇండియన్  సూపర్ హీరో ‘హనుమాన్’కి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకు అన్ని సెంటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తుంది హనుమాన్ మూవీ. నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ కి చేరువలో ఉన్న హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో స్టార్ హీరోల బిగ్ బడ్జట్ సినిమాల కలెక్షన్స్ ని కూడా బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో 3 మిలియన్ మార్క్ చేరుకున్న హనుమాన్ మూవీ పండగ సీజన్ ని ఇంకా పూర్తిగా కాష్ చేసుకోలేదు. థియేటర్స్ ఇష్యూ కొనసాగుతూనే ఉండడంతో నైజాంలో హనుమాన్ మూవీకి ఎక్కువ సెంటర్స్ లేవు. ఇది కూడా హనుమాన్ మూవీకి కలిసొచ్చే విషయమే.

Read Also: The Raja Saab: ఆ కటౌట్ కి ఆ మాత్రం సెలబ్రేషన్స్ చేయాల్సిందేలే…

థియేటర్స్ ఎక్కువగా లేని కారణంగా హనుమాన్ సినిమాని ఆడియన్స్ చూసే అవకాశం లేకుండా పోయింది. సంక్రాంతి సీజన్ అయిపోతే థియేటర్స్ విషయంలో హనుమాన్ కి మంచి జరుగుతుంది కాబట్టి ఈ సినిమాకి లాంగ్ రన్ తప్పకుండా ఉంటుంది. సంక్రాంతి సీజన్ అయిపోయాక కూడా హనుమాన్ సినిమా సంక్రాంతి సీజన్ స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టడం గ్యారెంటీ. సినీ అభిమానుల నుంచి ఇండస్ట్రీ వర్గాల వరకూ అందరినీ మెప్పిస్తున్న హనుమాన్ సినిమాని చూడడానికి కన్నడ సూపర్ స్టార్ శివన్న రెడీ అయ్యాడు. ఈరోజు మధ్యాహ్నం 3:10 నిమిషాలకి హనుమాన్ సినిమాని శివన్న చూడబోతున్నాడు.

Read Also: Ustaad: రాకింగ్ స్టార్ తో సందడి చేయనున్న థ్రిల్లింగ్ స్టార్…