NTV Telugu Site icon

ఒక్క సినిమా.. 550 సార్లు రీరిలీజ్.. హీరో ఎవరో తెలుసా..?

Om

Om

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. హీరోల పుట్టినరోజులు కానీ, స్పెషల్ అకేషన్స్ కు హీరోల హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. అయితే ఒక సినిమా రీరిలీజ్ మహా అయితే రెండు సార్లు చేస్తారు.. మూడు సార్లు చేస్తారు. కానీ, ఒక్క సినిమాను 550 సార్లు రిలీజ్ చేయడం ఎప్పుడైనా విన్నారా..? రిలీజ్ చేసిన ప్రతిసారి ఆ సినిమా అంతకుమించి హిట్ అందుకోవడం చూశారా..? అసలు ఆ సినిమా ఏంటి..? ఆ హీరో ఎవరు..? అనేది తెలుసుకుందాం. ఆ సినిమా పేరు ఓం. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కన్నడ హీరో ఉపేంద్ర దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ సరసన ప్రేమ హీరోయిన్ గా నటించింది. ఉపేంద్ర సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. ఆయన జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఓం సినిమా తీసినట్లు ఉపేంద్ర తెలిపాడు.

ఇక ఈ సినిమా మొట్ట మొదటిసారి 1995 లో రిలీజ్ అయ్యింది. అప్పట్లో ఈ చిత్రం ఒక పెద్ద సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఇక ఈ 20 ఏళ్ల కాలంలో ఈ సినిమాను మేకర్స్ 550 సార్లు రీరిలీజ్ చేశారు. ఒక సినిమా ఇలా 55ఓ సార్లు రిలీజ్ చేయడం పెద్ద రికార్డ్.. అందుకే అత్యధిక సార్లు రీ రిలీజ్ అయిన మూవీగా ఈ సినిమాకు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కింది. ఏ సినిమా అయినా ఏడాదికో, రెండేళ్లకో టీవీలో వస్తుంది.. కానీ ఈ చిత్రం దాదాపు 20 ఏళ్ళ వరకు టీవీలో రాలేదు. నిర్మాతలు ఈ సినిమా హక్కులను డిజిటల్ కు ఇవ్వకుండా రీరిలీజ్ లు చేస్తూనే ఉన్నారు. కేవలం రూ. 70 లక్షలు పెట్టి తీసిన ఈ సినిమా దాదాపు నిర్మాతకు రూ. 10 కోట్లు లాభాలను అందించింది. ఇక ఈ సినిమాకు కాను ఉత్తమ నటుడిగా శివ రాజ్ కుమార్ కు, ఉత్తమ నటిగా ప్రేమకు అవార్డులు కూడా వరించాయి.

ఇదే సినిమాను తెలుగులో ఓంకారం అనే పేరుతో రాజశేఖర్ రీమేక్ చేశాడు. ఇందులో కూడా ప్రేమనే హీరోయిన్. అయితే ఏ సినిమా ఇక్కడ ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేక పోయింది. ఇక కథ విషయానికొస్తే.. తండ్రి మాటను, దేవుడి మాటను జవదాటని ఒక యువకుడుకు కాలేజ్ లో ఒక అమ్మాయి లవ్ లెటర్ ఇచ్చి.. ప్రేమపేరుతో మోసం చేస్తుంది. అతడికి లేనిపోని అలవాట్లు నేర్పించి.. అతడిలో ఉన్న మంచిని చంపేస్తుంది. ఆ తరువాత ఆమె మరొక వ్యక్తిని పెళ్లాడడానికి రెడీ అవుతుంది. ఇక ప్రేమపేరుతో మోసపోయిన యువకుడు ఆమెను వేధించడం మొదలుపెడతాడు. తనను అలా చేసినందుకు పెళ్లి చేసుకోవాలని బలవంతపెడతాడు. చివరికి ఆమె కు బుద్ధిచెప్పి .. ఆ యువకుడు ఏమయ్యాడు అనేది కథ.. ఇక ప్రస్తుతం ఈ సినిమా ఉదయ్ టీవీ ఏకంగా రూ.10 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అది కూడా ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు.

Show comments