Kannada Hero Yash: ఆ స్టార్ దర్శకుడితో నెక్ట్స్ సినిమా.. అంతకుమించి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannada Hero Yash Planning His Next Movie With Star Director: కేజీఎఫ్-2 విడుదల అయినప్పటి నుంచి.. కన్నడ హీరో యశ్ తదుపరి ప్రాజెక్ట్ ఏంటి? అనేది అతిపెద్ద మిస్టరీగా మారింది. ఆ సిరీస్ తెచ్చిపెట్టిన విపరీతమైన క్రేజ్ వల్ల.. నెక్ట్స్ ఎవరితో, ఏ సినిమా చేయాలన్నది అతనికి కత్తి మీద సాములాగా మారింది. ఎందుకంటే.. కన్నడలో ప్రశాంత్ నీల్ స్థాయి దర్శకులు లేరు. వేరే డైరెక్టర్లతో సినిమా చేస్తే.. తన ఇమేజ్‌కి తగినట్టు వాళ్లు సినిమాలు తీస్తారా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. అందుకే, తదుపరి సినిమా విషయంలో ఏం చేయాలో తెలీక హీరో యశ్ మీమాంసలో పడిపోయాడు. ఆమధ్య ఓ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పుకార్లు షికారు చేశాయి కానీ, ఆ తర్వాత అవి ఫేక్ అని తేలిపోయింది. మరి, ఇతడు ఏ దర్శకుడితో జట్టు కడతాడా? అనే చర్చలు ఇండస్ట్రీలో మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన వార్త తెరమీదకి వచ్చింది. ఓ స్టార్ దర్శకుడితో భారీ బడ్జెట్ సినిమా చేసేందుకు యశ్ సమాయత్తమవుతున్నాడన్నదే ఆ వార్త సారాంశం. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరని అనుకుంటున్నారా? మరెవ్వరో కాదు.. శంకర్. ఆల్రెడీ యశ్, శంకర్ మధ్య కథా చర్చలు జరిగాయని.. ఇద్దరూ ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని పెన్ మూవీస్ సంస్థతో కలిసి బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ నిర్మించనున్నాడని.. నెట్ ఫ్లిక్స్ సైతం ఈ సినిమా నిర్మాణంలో భాగం కానుందని సమాచారం. వందల కోట్ల బడ్జెట్‌తో దేశంలోనే బిగ్గెస్ట్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రణాళికలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాను చేస్తోన్న ఇండియన్-2, RC15 సినిమాల్ని ముగించాక.. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో యశ్‌తో సెట్స్ మీదకి వెళ్లేలా శంకర్ ప్లాన్ చేస్తున్నాడట! అయితే, దీని మీద ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!