Site icon NTV Telugu

Rashmi Prabhakar: ఎట్టకేలకు ప్రియుడిని పెళ్లాడిన రష్మీ.. ఫోటోలు వైరల్

Rashmi

Rashmi

కన్నడ సీరియల్ నటి రష్మీ ప్రభాకరన్  ఎట్టకేలకు తన ప్రేమాయణానికి ఫుల్ స్టాప్ పెట్టింది. కొన్నేళ్లుగా అమ్మడు నిఖిల్  భార్గవ్‌ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే.  ఏప్రిల్‌ 25న  ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బెంగళూరులో జరిగిన ఈ వివాహ  వేడుకలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. ఇక ఈ విషయాన్నీ ఆమె సోషల్ మీడియా ద్వారా  తెలపడంతో అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక కొన్నిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో రష్మీ తన ప్రేమకథను రివీల్ చేసింది.

“నిఖిల్ ఒక  అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీలో పని చేస్తాడు..  ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా తను నాకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత మా ఇద్దరి మధ్య స్నేహం మొదలయ్యింది.. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఒక నెల క్రితమే ఇంట్లో మా ప్రేమ విషయాన్ని చెప్పగా వాళ్లు సర్‌ప్రైజ్‌ అయ్యారు, పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు. ఇక పెళ్లి తరువాత కూడా నటించమని, అదే ట్యాంకు ఇష్టమని నిఖిల్ చెప్పాడు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే  మనసెల్ల నేనే అనే సీరియల్ తో నటించి మెప్పించిన ఈ భామ ప్రస్తుతము పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపిస్తుంది.

Exit mobile version