సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం లేనిదే వారికి బతుకు ఉండదు. మేకప్ వేసుకోనిదే వారికి కడుపు నిండదు. ఈ పని కొంతమందికి ఫ్యాషన్.. మరికొందరికి పొట్ట కూడు.. దీనికోసం వారు ఏదైనా చేస్తారు. ఏదో తెరపై అలా కనిపించి లక్షలు తీసుకుంటున్నారు అని అనుకున్నా వారి పడే కష్టం వారికే తెలుస్తోంది. మరి ముఖ్యంగా హీరోయిన్లు.. ఈ ఫీల్డ్ లో వారు అందంగా ఉన్నంత వరకే వారికి అవకాశాలు.. అది లేనిరోజు ఒకప్పుడు పొగిడినవాళ్ళే విమర్శిస్తారు. అందుకోసమే ప్రతి హీరోయిన్ అందాన్ని కాపాడుకోవడం కోసం కష్టపడతారు. కడుపు మాడ్చుకుంటారు.. జిమ్ లు, యోగాలు అంటూ ఒళ్లును హూనం చేసుకుంటారు. ఇక మరికొంతమంది సర్జరీలతో ముఖాన్ని కొత్తగా మార్చుకుంటారు. అయితే అవి మంచిది కాదు అని తెలిసినా దైర్యం చేస్తుంటారు. కానీ వాటివలన ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు చాలామంది.
తాజాగా ఒక బుల్లితెర నటి ప్లాస్టిక్ సర్జరీ వికటించి మృత్యువాత పడడం చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. కన్నడ బుల్లితెర నటి చేతన రాజ్ పెద్ద హీరోయిన్ కావాలని కలలు కన్నది.. అవకాశాల కోసం ఎదురుచూసింది. అందం రెట్టింపు చేసుకుంటే కెరీర్ సెట్ అవుతుందని ఆశపడింది. దింతో వెంటనే ఒక వైద్యుడిని సంప్రదించి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొంది. సర్జరీ అయ్యాక సడెన్ గా ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమె ఊపిరితిత్తుల్లోకి ఎక్కువగా నీరు చేరిపోయింది. ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే చికిత్స కోసం డాక్టర్ శెట్టి కాస్మొటిక్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ఐసీయూ లేకపోవడంతో చేతన కొట్టుమిట్టాడుతూనే ప్రాణాలు విడిచింది. ఇక ఈ వార్త ప్రతి ఒక్క హీరోయిన్ ను కంటతఫై పెట్టిస్తోంది. తమ జీవితాలను తలుచుకొని చాలామంది హీరోయిన్లు చేతన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అందం ముఖ్యమే కానీ.. ఇలా చేయకండి అంటూ నెటిజన్స్, హీరోయిన్స్ కు సపోర్ట్ ఇస్తున్నారు.
