Tapori Satya: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ డైరెక్టర్ మరియు నటుడు టపోరి సత్య కన్నుమూశారు.గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో పోరాడుతున్న ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక సత్య మృతి కన్నడలో తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. రెండు రోజుల క్రితమే కన్నడ బుల్లితెర నటుడు సంపత్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు సత్య.. కన్నడ ఇండస్ట్రీకి ఏమైంది అంటూ కన్నడ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్య .. డైరెక్టర్ గానే కాకుండా విలన్ గా కూడా నటించి మెప్పించారు. యోగేష్, నందిత జంటగా నటించిన నంద లవ్స్ నందిత అనే సినిమాలో విలన్ గా మెప్పించాడు. ఈ సినిమా సత్యకు మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది.
Shruti Haasan: అక్కడ కొత్త పచ్చబొట్టు.. శృతి నువ్వు మారిపోయావ్..?
మేళా అనే సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఇక ఇప్పుడు ఒక కొత్త సినిమాను మొదలు కూడా పెట్టిన సత్య ఇలా సడెన్ గా మృతి చెందడం బాధాకరమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక సత్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక సత్యకు భార్య.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. సత్య తల్లి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి సినిమానే లోకంగా పెరిగాడు. మా అందరికి ఏ కష్టం వచ్చినా దైర్యం చెప్పేవాడు. మా కుటుంబానికి ఎప్పుడు తోడుగా ఉంటానని చెప్పాడు. సత్య మరణం మాకు తీరని లోటు అంటూ ఎమోషనల్ అయ్యారు.
