NTV Telugu Site icon

Kanmani Rambo Khatija Twitter Talk : ఎలా ఉందంటే ?

Krk

Krk

“కాతు వాకుల రెండు కాదల్” మూవీ ఈరోజు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి , సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెలుగులో “కన్మణి రాంబో ఖతీజా” పేరుతో విడుదల చేశారు. ఇక ఇప్పటికే సినిమాను వీక్షించిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రధానంగా ముగ్గురి చుట్టూ తిరిగే ఈ ప్రేమకథలో రాంబో… కన్మణిని ఇష్టపడతాడా? లేక ఖతీజానా? అసలేం జరుగుతుంది ? అనే చర్చ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా సినిమాలో సామ్ హైలెట్ అంటున్నారు. అయితే అసలు సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ వచ్చేదాకా ఆగాల్సిందే.