కోలీవుడ్, టాలీవుడ్ లో ఒకే రేంజ్ మార్కెట్ ని మైంటైన్ చేస్తూ… రెండు ఇండస్ట్రీల్లో స్టార్ హీరోగా ఉన్న సూర్య పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ప్రస్తుతం పీరియాడిక్ డ్రామా సినిమా చేస్తున్నాడు. సిరుత్తే శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పది భాషల్లో, 2D-3D వెర్షన్స్ లో, ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కానుంది. సూర్య 42 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీకి ఇటీవలే కంగువా అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. 2024 స్టార్టింగ్ లో రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం సూర్య ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న కంగువా సినిమాపై కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, KGF సినిమాలు సౌత్ నుంచి రిలీజ్ అయ్యి వెయ్యి కోట్లకి పైగా రాబట్టాయి.
ఇప్పుడు కోలీవుడ్ నుంచి కంగువ రిలీజ్ అయ్యి మొదటి వెయ్యి కోట్ల సినిమాగా హిస్టరీ క్రియేట్ చేస్తుందని అక్కడి ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తమిళ చిత్ర పరిశ్రమకి కంగువా, బాహుబలి అవుతుందని మేకర్స్ కూడా నమ్మకంతో ఉన్నారు. ఇంత భారి అంచనాలు ఉన్న సినిమాని తెలుగులో యువీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తోంది. కంగువా ప్రోమో కోసం సూర్య ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ కంగువా ప్రోమోని జులై 23న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసారు. సూర్య బర్త్ డే రోజున కంగువా ప్రోమోని రిలీజ్ చేసి పాన్ ఇండియా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యారు. మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ లు సూపర్ బజ్ క్రియేట్ చేసాయి కాబట్టి కంగువా ప్రోమో కూడా అదే రేంజులో కట్ చేస్తే చాలు, ప్రాజెక్ట్ పై హైప్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది.
