NTV Telugu Site icon

Kangana Ranaut: మహిళలలో ఆ భాగాలే కాదు ఇతర భాగాలు కూడా ఉన్నాయి.. మాజీ ఎంపీపై కంగనా ఫైర్

Kangana

Kangana

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఇంకోపక్క రాజకీయాల్లోను యాక్టివ్ గా ఉంటుంది. ఈ దసరాకు ఆమె ఢిల్లీలో రామ్‌లీలా మైదానంలో రావణం దహనం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విషయం తెల్సిందే. ఇక ఆ కార్యక్రమం అయ్యాక కంగనాపై విమర్శలు తలెత్తాయి. ట్విట్టర్ లో కంగనా స్విమ్ సూట్ వేసుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. “ఈమె కంగనా రనౌతేనా?.. మోదీ ప్రభుత్వాన్ని ఎంటర్‌టైన్‌ చేస్తున్న ఓకే ఒక్క బాలీవుడ్ లేడీ” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ పై మాజీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి స్పందిస్తూ.. “SPG గాసిప్ ప్రకారం ఆమె తరచుగా ప్రయాణించే వ్యక్తి. SPG ఎందుకు కబుర్లు చెప్పాలి? ఎందుకంటే సంస్థ ఆమెకోసం ఎక్కువగానే పని చేస్తుంది. రాంలీలా చివరి రోజున ఆమెను ముఖ్య అతిథిగా పిలవడమే అందుకు నిదర్సనం. అది ఒక గౌరవం లేని సంస్థ” అంటూ రాసుకొచ్చాడు.

Suriya 43: ఏం కాంబో రా మావా.. రికార్డులు గల్లంతు అవ్వడం ఖాయం

ఇక ఈ ట్వీట్ పై కంగనా స్పందించింది. ” నా స్విమ్ సూట్ ఫోటో చూపించి ఇలా నీచంగా మాట్లాడారంటే మీ వక్రబుద్ధి బయటపడింది.. నేను రాజకీయాల్లోకి రావడానికి కేవలం నా శరీరం మాత్రమే కారణమని మీరు చెప్తున్నారు. నేను హిందీ చిత్రాల్లో ఇప్పటివరకు నేనొక నటిని, రచయిత, దర్శకుడు, నిర్మాత, విప్లవ రైట్ వింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ను.. నాకు బదులుగా భవిష్యత్తులో గొప్ప నాయకుడిగా మరియు మార్గదర్శకత్వం మరియు మార్గదర్శకత్వానికి అర్హుడైన ఎవరైనా యువకుడు నా ప్లేస్ లో ఉంటే అతను కూడా శరీరాన్ని అమ్ముకున్నాడు అని అనగలరా..?. స్త్రీలు సెక్స్ కోసం మాత్రమే కాదు, వారికి మెదడు, గుండె, చేతులు, పాదాలు వంటి ఇతర అవయవాలు ఉన్నాయి. మగవాడికి ఉన్న లేదా గొప్ప నాయకుడిగా ఉండటానికి అవసరమైన ప్రతిదాన్ని కలిగి ఉంటారు” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments