Site icon NTV Telugu

‘తలైవి’ వచ్చేది ఎప్పుడంటే…

Thalaivii

Thalaivii

పురచ్చి తలైవి జయలలిత బయోపిక్ ‘తలైవి’ విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 10వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను మూడు భాషల్లో విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాతలు విష్ణు వర్థన్, శైలేష్ ఆర్ సింగ్ తెలిపారు. జయలలితగా ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించగా, ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు ‘యు’ సర్టిఫికెట్ లభించింది. గత యేడాది జూన్ 26న ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత ఈ యేడాది ఏప్రిల్ 23న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. ఈ లోగా కరోనా సెకండ్ వేవ్ తో అదీ జరగలేదు.

Read Also: తెలంగాణ ఎగ్జిబిటర్స్ వైఖరిని ఖండించిన ఎ.టి.ఎఫ్.పి.జి.

ఇక ఇప్పుడు దేశ వ్యాప్తంగా థియేటర్లు నిదానంగా తెరుచుకోవడం, తమిళనాడులో సైతం యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడపడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సెప్టెంబర్ 10న ‘తలైవి’ని విడుదల చేయబోతున్నారు. తమిళ, తెలుగు వర్షన్స్ కు ట్యాగ్ లైన్ ఏమీ పెట్టలేదు కానీ హిందీ వర్షన్ కు మాత్రం ‘జయాస్ జర్నీ… సినిమా సే సీఎం తక్’ అని పెట్టారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదల కాబోతున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తలైవి’ కావడం విశేషం. మరి ప్రముఖ దర్శకుడు విజయ్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

Exit mobile version