ఈ ఏడాది ఆస్కార్స్ వేడుక కార్యక్రమం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. హీరో విల్ స్మిత్, యాంకర్ క్రిస్ చెంప పగులగొట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడమే కాకుండా ప్లువు విమర్శలకు దారి తీసింది. తన భార్యను హేళన చేసినందుకు విల్ స్మిత్, క్రిస్ ను స్టేజిపైనే కొట్టాడు. ఒక స్టార్ హీరో అయ్యి ఉంది కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా అందరి ముందు అలా కొట్టడం ఏంటని కొందరు విమర్శిస్తుండగా.. ఇంకొందరు, తల్లి, భార్యను ఎవరైనా ఏదైనా అంటే కోపం వస్తుంది.. అది సహజం అని మరికొందరు విల్ స్మిత్ కి మద్దతు ఇస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా తనదైన శైలిలో హీరోకు మద్దతు ప్రకటించింది. తన సోషల్ మీడియా ద్వారా ఆమె విల్ స్మిత్ ని సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. ” క్రిస్ ఒక ఇడియట్ లా మాట్లాడాడు.. కామెడీ చేయడానికి మా అమ్మ లేక సోదరికి ఉన్న వ్యాధిని ఉపయోగించుకుంటే నేను ఊరుకోను.. విల్ స్మిత్ కన్నా గట్టిగా తన్నేదాన్ని.. ఇలాంటి వాళ్లని వదిలి పెట్టకూడదు. ఆయన త్వరలోనే నా లాక్ అప్ షోకి వస్తాడని ఆశిస్తున్నా.. అప్పుడు కానీ చెప్పను” అంటూ ఫైర్ అయింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే క్రిస్ ని కొట్టినందుకు విల్ స్మిత్ అందరిముందు క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే.
