Site icon NTV Telugu

Kangana Ranaut : నా ఇంటికి లక్ష కరెంట్ బిల్ వేస్తారా.. కంగనా ఫైర్

Kangana

Kangana

Kangana Ranaut : కంగనా రనౌత్ కు దేశ వ్యాప్తంగా ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఆమె బాలీవుడ్ క్వీన్ గా పేరు సంపాదించుకుంది. అంతే కాకుండా ఫైర్ బ్రాండ్ అనే ముద్ర కూడా వేయించుకుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై రచ్చ చేస్తూనే ఉంటుంది. తాజాగా తన ఇంటికి లక్ష కరెంట్ బిల్ వేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె బీజేపీ నుంచి ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. తనకు హిమాచల్ ప్రదేశ్ లో ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటికి రూ.లక్ష కరెంట్ బిల్ వేశారంట. దానిపై ఆమె సీరియస్ అయింది. ఆ ఇంట్లో తాను అసలు ఉండట్లేదని.. అలాంటప్పుడు లక్ష కరెంట్ బిల్ ఎలా వేస్తారంటూ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడింది. తనపై ఏదో ఒక విధంగా కక్ష సాధించేందుకు ఇలాంటివి చేస్తున్నారంటూ తెలిపింది.

Read Also : Tamannaah : వాళ్ల మీద చేతబడి చేస్తా.. తమన్నా షాకింగ్ కామెంట్స్

‘ఇలాంటి పరిస్థితులు చూస్తే షాకింగ్ గా అనిపిస్తోంది. అసలు ప్రజలు సమస్యలను పక్కన పెట్టేసి ఇలాంటివి చేయడం ఏంటో అర్థం కావట్లేదు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దయచేసి యువత ఆలోచించి పోరాడాలి’ అంటూ తెలిపింది ఈ భామ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కంగనా ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పలు సినిమాల్లో నటిస్తోంది. బయోపిక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే ఆమె.. బాలీవుడ్ ఖాన్స్ మీద ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూనే ఉంటుంది.

Exit mobile version