NTV Telugu Site icon

Kangana Ranaut: ప్రియాంకాను కరణ్ జోహర్ బ్యాన్ చేశాడు.. మరోసారి బాంబ్ పేల్చిన కంగనా

Kangana Ranaut On Karan

Kangana Ranaut On Karan

Kangana Ranaut Sensational Comments On Karan Johar Again: సందర్భం దొరికినప్పుడల్లా బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌పై విరుచుకుపడే ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్.. తాజాగా మరోసారి అతనిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌లోని రాజకీయాలతో విసుగెత్తిపోవడం వల్లే తాను హిందీ పరిశ్రమని వదిలేశానని చెప్పిన ప్రియాంకా చోప్రాకు మద్దతు తెలుపుతూ.. ఆమెకు ఆ గతి పట్టించింది కరణ్ జోహారేనని కంగనా బాంబ్ పేల్చింది. ప్రియాంకా చెప్పినట్టు కొందరు బాలీవుడ్‌లో గ్యాంగ్‌గా మారి పాలిటిక్స్ చేస్తున్నారని, కరణ్ జోహార్ ఆమెని బ్యాన్ చేశాడని పేర్కొంది. షారుఖ్ ఖాన్‌తో ప్రియాంకా క్లోజ్‌గా ఉండటం చూసి కరణ్ తట్టుకోలేకపోయాడని, అందుకే ఆమెకు అవకాశాలు రానివ్వకుండా చేసి, మానిసకంగా వేధించాడంటూ వరుస ట్వీట్లతో ధ్వజమెత్తింది.

Vishwak Sen: మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించిన విశ్వక్ సేన్.. డైరెక్టర్ ఎవరంటే?

‘‘బాలీవుడ్‌ గురించి ప్రియాంకా చోప్రా ఇదే చెప్పాలని అనుకుంది. పరిశ్రమలో కొందరు గ్యాంగ్‌గా ఏర్పడి, ఆమెను అవమానించారు. ఇండస్ట్రీ నుంచి ప్రియాంకా పారిపోయేలా చేశారు. స్వయంకృషితో ఎదిగిన ఆమెను భారత్‌ వదిలి వెళ్లిపోయేలా చేశారు. కరణ్‌ జోహార్‌ ఆమెను బ్యాన్‌ చేశాడనే విషయం అందరికీ తెలుసు. షారుఖ్‌తో ప్రియాంక సాన్నిహిత్యంగా మెలగడం కరణ్‌కి నచ్చలేదు. దాంతో కరణ్‌తో ఆమెకు సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ విషయంపై అప్పట్లో మీడియాలో ఎన్నో కథనాలు కూడా వచ్చాయి. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చేవారిని హాని కలిగించేందుకు ఎప్పుడూ సిద్ధంగా మూవీ మాఫియా.. ప్రియాంకా దేశం వదిలి వెళ్లిపోయే వరకు వేధించింది. సినీ పరిశ్రమ వాతావరణాన్ని, సంస్కృతిని నాశనం చేస్తున్నందుకు ఆ వ్యక్తి (కరణ్‌ను ఉద్దేశిస్తూ) బాధ్యత వహించాలి. అమితాబ్‌బచ్చన్‌, షారుక్‌ వంటివారు సినిమాల్లోకి వచ్చిన రోజుల్లో ఇలాంటి పరిస్థితులు అస్సలు లేవు’’ అంటూ కంగనా రనౌత్ వరుసగా ట్వీట్లు చేసింది. ఇప్పుడు ఆమె ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

Meter Trailer: వాడు బాల్ లాంటోడు.. ఎంత కొడితే అంత పైకి లేస్తాడు

అంతకుముందు ప్రియాంకా చోప్రా బాలీవుడ్ గురించి ఏం చెప్పిందంటే.. ‘‘బాలీవుడ్‌లో నన్ను ఒక మూలన పడేశారు. నాకు కొందరితో విభేదాలు ఏర్పడటం వల్ల.. అవకాశాలు రాకుండా చేశారు. ఎన్నో వేధింపులకు గురి చేశారు. హిందీ సినీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. నాకు ఆ పాలిటిక్స్ చేయడం తెలీదు. ఆ రాజకీయాలతో నేను విసిగెత్తిపోయి, బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకోవాలని అనుకున్నా’’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే కంగనా రనౌత్‌తో పాటు వివేక్‌ అగ్నిహోత్రి వంటి సినీ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు.

Show comments