Site icon NTV Telugu

Kangana : రక్తంతో నిండిన బెడ్‌షీట్ చూసి భయపడ్డా..

Kangana

Kangana

బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ ఎప్పుడూ తన స్పష్టమైన మాటలతో, ధైర్యమైన ఆలోచనలతో వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఆమె తన చిన్ననాటి పీరియడ్స్ అనుభవాలను పంచుకున్నారు. మొదటి సారి ఆ అనుభవం ఎలా ఎదుర్కొన్నారు? అప్పట్లో ఎదురైన భయం, తల్లితో ఉన్న బంధం, ఇంట్లో జరిగిన సంఘటనల వరకు ఓపెన్‌గా చెప్పారు. ఈ విషయాలు విన్నవారిని ఆలోచింపజేసేలా ఉన్నాయి.

Also Read : Tamannaah Bhatia : బోల్డ్ సీన్స్ ఓకే చేశాకే.. నా కెరీర్ మారింది

కంగనా మాట్లాడుతూ.. ‘ స్కూల్‌లో 9వ తరగతిలో ఉన్నప్పుడు టీచర్లు పీరియడ్స్ గురించి చెప్పేవారు. కానీ చాలా మందికి అది 8వ తరగతిలోనే వస్తుంది. నేను అప్పుడు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. మా అమ్మ కూడా ఈ విషయంపై నాకు ఎప్పుడూ చెప్పలేదు. టీవీలో వచ్చే శానిటరీ ప్యాడ్ ప్రకటనల ద్వారానే కొంత తెలుసుకున్నాను. నా క్లాస్‌లోని చాలా అమ్మాయిలకు పీరియడ్స్ వచ్చాయి. కానీ నాకు రాలేదు. ఒకసారి మా అమ్మ అడిగింది – ‘ఇంకా రాలేదా?’ అని. నేను లేదు అన్నప్పుడు ఆమె చాలా టెన్షన్‌ పడింది. ఆ సమయంలో నేను బొమ్మలతో ఆడుకునేదాన్ని. ఒక రోజు కోపంతో అమ్మ నా బొమ్మలన్నీ బయటికి విసిరేసింది. తర్వాత ‘నీకు ఒక రోజు పీరియడ్స్ వస్తాయి, రక్తం కనిపిస్తే వెంటనే నా దగ్గరకు రావాలి’ అని చెప్పారు. ఒక రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి బెడ్‌షీట్ మొత్తం రక్తంతో నిండిపోయింది. నేను భయపడి ఏడవడం మొదలు పెట్టాను. కానీ అమ్మ మాత్రం సంతోషపడింది. ఎందుకంటే నాకు చివరికి పీరియడ్ వచ్చింది. నేను మాత్రం ఏడుస్తూనే ఉన్నాను. ఇకపై ప్రతి నెల ఇదే జరుగుతుందా? అని భయపడ్డాను. ఆ సమయంలో నాకు భయం వేసింది. ఇకపై నాన్న నన్ను ఒడిలో కూర్చోనివ్వరేమో, అమ్మ నన్ను హత్తుకోదేమో అనిపించింది. నేను మా అమ్మానాన్నలకు దూరం అవుతానని చాలా బాధపడ్డాను’ అని కంగనా చెప్పుకొచ్చారు.

Exit mobile version