బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటి కంగనా రనౌత్. నిర్మొహమాట ధోరణి, వివాదాస్పద వ్యాఖ్యలు, ధైర్యంగా అభిప్రాయాలు చెప్పే అలవాటు కారణంగా ఆమె తరచు వార్తలో నిలుస్తూ ఉంటుంది. అందుకే ఆమెను చాలామంది ఫైర్ బ్రాండ్‌గా పిలుస్తుంటారు. అయితే ఇటీవల కంగనా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్ అయింది. అదే పెళ్లి.. గత కొన్ని నెలలుగా మీడియాలో ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ పలు రకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. అభిమానుల్లో కూడా దీనిపై ఆసక్తి పెరిగింది. ఈ వార్తలపై కంగనా స్వయంగా స్పందిస్తూ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
Also Read : Tamannaah Bhatia : బోల్డ్ సీన్స్ ఓకే చేశాకే.. నా కెరీర్ మారింది
“నా పెళ్లి గురించి ఇప్పటివరకు వందల వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఒకటి నిజం కాదు. అసలు నేను ఇప్పటివరకు పెళ్లి పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం. పెళ్లి వ్యవస్థపైనా నాకు పెద్దగా నమ్మకం లేదు. ఈ పెళ్లి, కుటుంబం, పిల్లలు అనే ఛాప్టర్ నా లైఫ్‌స్టైల్‌కు సరిపడవు. నాకు పెళ్లి కావట్లేదని ఎలాంటి బాధ లేదు. ప్రస్తుతం నా దృష్టి పూర్తిగా సినిమాలు, రాజకీయాల పై ఉంది. ఈ రంగాల్లో నాకు సంతృప్తి ఉంది” అంటూ కంగనా వ్యాఖ్యానించారు. ఇక కంగనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్ అయ్యాయి. చాలామంది ఆమె స్పష్టమైన ధోరణిని మెచ్చుకుంటే, ఇంకొందరు మాత్రం విమర్శిస్తున్నారు. అయితే కంగనాకు అలాంటి విమర్శలంటే పెద్దగా భయం లేదు. తన జీవితం, తన నిర్ణయాలపై తాను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె బహిరంగంగా చెప్పకనే చెబుతున్నారు.
