NTV Telugu Site icon

Kangana Ranaut: బాలీవుడ్ మాఫియా.. వారికి అవార్డులు ఏంటీ..?

Kangana

Kangana

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడికి నేపోటిజం అన్నా.. నెపో కిడ్స్ అన్నా పట్టరాని కోపం అన్న విషయం అందరికి తెల్సిందే. కొద్దిగా ఛాన్స్ దొరకడం ఆలస్యం వారికి ఏకిపారేయడంలో ముందు ఉంటుంది. గత కొన్ని రోజులుగా కంగనా తన ట్వీట్స్ కు గ్యాప్ ఇచ్చింది. ఇక తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ రూపంలో మరోసారి కంగనా తన నోటికి, చేతికి పనిచెప్పింది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ అందుకున్న వారికి కంగ్రాట్స్ చెప్తూనే.. ఆ అవార్డ్స్ అందుకున్న నెపో కిడ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అవార్డులలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఒకటి. గతరాత్రి ముంబైలో ఈ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక అన్ని వుడ్స్ నుంచి ఈ అవార్డులకు అర్హత పొందినవారిని ఆహ్వానించి వారికి అవార్డులను ప్రధానం చేశారు.

Sobhita Dhulipala: నాగ చైతన్య రూమర్డ్ గాళ్ ఫ్రెండ్.. లిప్ లాక్ లకే పరిమితమా..?

బెస్ట్ యాక్టర్ గా రిషబ్ శెట్టి.. బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి.. బెస్ట్ యాక్ట్రెస్ గా మృణాల్ ఠాకూర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా టబు, బెస్ట్ సినిమా గా కాంతార, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అనుపమ్ ఖేర్ పేర్లను రాసుకొస్తూ.. వీళ్ళందరూ తమ తమ ట్యాలెంట్ ను బట్టి అవార్డులకు అర్హత సాధించారని చెప్పుకొచ్చింది కంగనా. కానీ.. బెస్ట్ యాక్టర్ రణబీర్ కపూర్(బ్రహ్మాస్త్ర), బెస్ట్ యాక్ట్రెస్ అలియా భట్(గంగూభాయి కతియావాడి) గా వీరు అవార్డులు పొందడం ఏంటి..? బాలీవుడ్ మాఫియా.. నెపోటిజం, నెపో కిడ్స్ కావడం వలనే వీరు అవార్డును పొందగలిగారు అంటూ కంగనా మండిపడింది. బాలీవుడ్ ఎప్పటికి నెపోటిజాన్నీ వదలడం లేదని చెప్పిన కంగనా.. అవార్డులు కూడా వారికే ఇవ్వడానికి ప్రయత్నిస్తుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కంగనా ట్వీట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. మరి ఫైర్ బ్రాండ్ వ్యాఖ్యలపై బాలీవుడ్ ప్రముఖులు ఏమంటారో చూడాలి.

Show comments