Site icon NTV Telugu

Kangana: భారీ మెజారిటీతో దూసుకుపోతున్న కంగనా

Kangana

Kangana

Kangana Ranaut Election Result :లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నుంచి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తయిన్నాయి. ఈ వార్త రాసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్యపై 71663 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ట్రెండ్స్‌తో కంగనా తన విజయం ఖాయం అని భావిస్తూ సంతోషంగా ఉంది. ఈ క్రమంలో ఆమె ANI తో మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్యను టార్గెట్ చేసింది. తన గెలుపుపై ​​కాన్ఫిడెంట్‌గా ఉన్న కంగనా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే దాని పర్యవసానాలను చవిచూడాల్సి వస్తుందని పేర్కొంది. ఓ మహిళ గురించి ఇంత నీచమైన మాటలు మాట్లాడితే… నేడు భారతీయ జనతా పార్టీ మండి నుంచి ఆధిక్యత సాధించిన తీరు, కూతుళ్లకు జరిగిన ఈ అవమానాన్ని మండి వాసులు పట్టించుకున్నారని చెప్పుకొచ్చింది. నేను ముంబయి వెళ్లడం విషయానికొస్తే, ఇది నా జన్మస్థలం.

Pawan kalyan : పవన్ కల్యాణ్ కు సెలెబ్రేటీస్ అభినందనల వెల్లువ..ట్వీట్స్ వైరల్..

ఇక్కడ నేను ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను. మోడీ జీ కల సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్, నేను ఆయన సైన్యంగా పని చేస్తాను. కాబట్టి నేను ఎక్కడికీ వెళ్లను. బహుశా ఎవరో ఒకరు తమ బ్యాగులు సర్దుకుని ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటుంది కానీ నేను ఎక్కడికీ వెళ్లను అని పేర్కొంది. ఇక ఎన్నికల ప్రచారంలో కంగనా, విక్రమాదిత్యల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. నటి విక్రమాదిత్యను యువరాజు, అధికార దాహం, దొంగ మరియు మహిళా వ్యతిరేకి అని పేర్కొంది. కాగా, బాలీవుడ్ క్వీన్ కంగనా మండికి కాదని, ముంబయికి చెందినదని కాంగ్రెస్ నేత విక్రమాదిత్య అన్నారు. ఎన్నికల పర్యటన ముగించుకుని ముంబై వెళ్లనున్న ఆమె కేవలం వినోదం కోసమే ఇక్కడికి వచ్చారని, దేవభూమి హిమాచల్ నుండి కంగనా తనను తాను శుద్ధి చేసుకుని తిరిగి బాలీవుడ్‌కి వెళ్తుందని ఆయన కామెంట్ చేశారు. విక్రమాదిత్య చేసిన ఈ ప్రకటనపై కంగనా అసహనం వ్యక్తం చేసింది.

Exit mobile version