Site icon NTV Telugu

నేడు ముంబై పోలీసుల ఎదుటకు కంగనా… సిక్కు వివాదం

Kangana

బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ సిక్కు వివాదంలో ఈరోజు ముంబై పోలీసుల ఎదుట హాజరు కానుంది. కంగనా బుధవారం తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఆమె కొన్ని వ్యక్తిగత పనుల కారణంగా అక్కడికి చేరుకోలేకపోయింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం కంగనా రనౌత్ ఈరోజు ఉదయం 11 గంటలకు తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ఖార్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోవచ్చు.

సిక్కు వివాదం ఏంటి ?
వాస్తవానికి కంగనా తన సోషల్ మీడియా పోస్ట్‌లలో ఒకదానిలో రైతుల ఉద్యమాన్ని వేర్పాటువాద గ్రూపుతో ముడిపెట్టి, సిక్కు సంఘంపై వ్యాఖ్యానించింది. దీంతో ఆగ్రహానికి గురైన సిక్కు సంస్థ ఫిర్యాదు మేరకు గత నెలలో ఖార్ పోలీస్ స్టేషన్‌లో రనౌత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి కంగనా ముంబై పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ నెల ప్రారంభంలో ఆమెను విచారించేందుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. డిసెంబరు 22న ఖార్ పోలీసుల ఎదుట హాజరు అవుతుందని కంగనా తరపు న్యాయవాది బాంబే హైకోర్టుకు తెలిపారు.

Read Also :

https://ntvtelugu.com/rrr-team-at-pro-kabaddi/

కంగనా అరెస్ట్ కు గడువు ?
కంగనా తరపు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ మాట్లాడుతూ “హైకోర్టు ఆదేశాల స్ఫూర్తి, ఉద్దేశ్యం ప్రకారం మేము దర్యాప్తు అధికారిని ముందస్తు తేదీ కోసం అభ్యర్థించాము. కోర్టు తదుపరి విచారణలోపు ప్రక్రియను వేగవంతం చేయాలనుకుంటున్నాము. అయితే దర్యాప్తు అధికారులు నా ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లకు స్పందించలేదు. ఆర్డర్ ఇచ్చిన వెంటనే అతనికి పంపిన లేఖకు కూడా అతను స్పందించలేదు. ఇప్పుడు నా క్లయింట్ అందుబాటులో ఉన్న ఏదైనా సమీప తేదీలో పోలిసుల ఎదుట హాజరవుతారు. అధికారులు మాకు సమయం ఇవ్వకపోతే దాని యోగ్యతపై నిర్ణయం తీసుకునే విషయాన్ని హైకోర్టుకు వదిలివేస్తాము. రైతుల నిరసనలను వేర్పాటువాద గ్రూపుతో ముడిపెట్టిన ఆమె సోషల్ మీడియా పోస్ట్‌పై రనౌత్‌ను 2022 జనవరి 25 వరకు అరెస్టు చేయబోమని ముంబై పోలీసులు గతంలో బాంబే హైకోర్టుకు తెలిపారు” అని అన్నారు. దీంతో కంగనా ఈరోజు ముంబై పోలిసుల ఎదుట హాజరై తన స్టేట్‌మెంట్‌ ఇస్తుందని అంటున్నారు.

ఇదీ జరిగింది !
కంగనా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో ఒకదాని తర్వాత సిక్కు సంఘంలోని కొంతమంది సభ్యులు నటిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంగా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అభివర్ణించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఖర్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ రనౌత్ ఈ నెల ప్రారంభంలో ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కంగనా కామెంట్స్ భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కు అని హైకోర్టు పేర్కొంది. దీంతో కోర్టు కంగనాకు అరెస్ట్ నుంచి మధ్యంతర ఉపశమనం ఇచ్చింది.

Exit mobile version