Site icon NTV Telugu

Gangubai: ఆలియాకు కంగన అభినందనలు

బాలీవుడ్ లో కంగనా రనౌత్ విమర్శల నుంచి తప్పించుకున్న వారు బహు అరుదు. ఇక వారసులను అయితే కంగనా ఓ ఆట ఆడుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా ఎన్నో మార్లు ఆలియా భట్ పై విమర్శల జల్లు కరిపించింది. ఆలియాను వారి కుటుంబసభ్యులతో కలపి ‘బాలీవుడ్ మాఫియా గ్యాంగ్’ అనేసింది కూడా. ఇక ఆలియా నటించిన ‘గంగూబాయి’ సినిమా రిలీజ్‌కు ముందు 200 కోట్ల బడ్జెట్ తో తీసిన ఆ సినిమా ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుందని కంగనా సోషల్ మీడియాలో ప్రకటించేసింది. అలియాను ‘పాపా కి పరి’, ‘రోమ్‌కామ్ బింబో’ అనేసింది.
అయితే సినిమా విడుదలైన తర్వాత వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌ని చూసి ఆశ్చర్యానికి గురై ప్లేట్ మార్చేసింది కంగనా. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ‘దక్షిణాది చిత్ర పరిశ్రమలో రికార్డ్ బద్దలు కొట్టే కలెక్షన్‌లతో థియేటర్లు కళకళలాడుతున్నాయని వినడం ఆనందంగా ఉంది. అలాగే హిందీ బెల్ట్‌లో కూడా కొన్ని బేబీ స్టెప్పులు పడుతున్నట్లు వింటున్నాను.

అవి బేబీ స్టెప్స్ కావచ్చు కానీ అవి చిన్నవి కావు. వెంటిలేటర్లపై ఉన్న థియేటర్లకు చాలా కీలకమైనవి. గొప్పవి’ అంటూ గంగూబాయిని ఆకాశానికెత్తేసింది. ఇంకా ‘సినిమా మాఫియా సందర్భానుసారంగా పెరిగి ఏదైనా మంచి చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అలా జరిగితే ఖచ్చితంగా మెచ్చుకుంటాము. ఉత్తమమైన వాటి కోసం ఆశిస్తున్నాను’ అని పొగిడింది కంగనా. ఇలా కంగనా తన ఇగో క్లాష్‌ను పక్కన పెట్టడం, ‘గంగూబాయి’ని ప్రశంసించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. రెండు రోజుల క్రితం, ‘గంగూబాయి…’ కి తప్పుడు తారాగణం సెట్ అయి ఉందని, అది చిత్రానికి అతిపెద్ద లోపం అవుతుందని అన్న కంగనా ఇప్పుడు ప్రజాభిప్రాయానికి విలువనిస్తూ నిజాయితీగా పోస్ట్ చేసినందుకు ప్రశంసలు అందుకుంటోంది. ఇదిలా ఉంటే కంగనా ఆల్ట్‌ బాలాజీ రాబోతున్న ‘లాక్ అప్‌’ రియాలిటీ షో కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉంది. మరి కంగనా ప్రశంసలకు ఆలియా ఏమని బదులిస్తుందో చూడాలి.

Exit mobile version