NTV Telugu Site icon

Kamal Rajini: ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు…

Kamal Rajini

Kamal Rajini

తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది స్టార్స్ ఉన్నారు. సూర్య, విక్రమ్, ధనుష్, విజయ్, అజిత్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఈ స్టార్స్ అందరూ మంచి సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి తమకంటూ సొంతం మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. అయితే మలయాళంకి మమ్ముట్టి-మోహన్ లాల్ ఎలానో… తెలుగులో ఎన్టీఆర్-ఎఎన్నార్ ఎలానో… కన్నడకి రాజ్ కుమార్-విష్ణువర్ధన్ ఎలానో… అలా తమిళ సినిమా ఇండస్ట్రీకి కమల్-రజినీ అలా నిలిచారు. ఈ ఇద్దరు గత నాలుగు దశాబ్దాలుగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ముందుకి నడిపిస్తునే ఉన్నారు. తమ మార్కెట్ పెంచుకోవడమే కాదు తమిళ సినిమా స్థాయిని పెంచిన హీరోలు రజిని-కమల్. తమిళనాడు నుంచి ఓవర్సీస్ వరకూ అన్ని సెంటర్స్ లో అభిమానులు ఉన్న ఈ హీరోలు గత కొంతకాలంగా సరైన సినిమాలు చేయలేదు. దీంతో వీళ్ల టైం అయిపొయింది, ఇక సినిమాలు మానేయడం బెటర్, కొత్త స్టార్స్ కమల్-రజినీకాంత్ లని మించి పోయారు అనే కామెంట్స్ వినిపించడం మొదలయ్యింది.

ఆ కామెంట్స్ అన్నింటికీ ఎండ్ కార్డ్ వేశారు కమల్-రజినీ. సరిగ్గా సంవత్సరం క్రితం జూన్ నెలలో విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. విక్రమ్ సినిమా ఏకంగా నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేసి కోలీవుడ్ లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. కమల్ లాంటి నటుడు మాస్ సినిమా చేస్తే ఇంపాక్ట్ ఏ రేంజులో ఉంటుందో విక్రమ్ సినిమా నిరూపించింది. ఇక ఇప్పుడు రజినీ వంతు వచ్చింది, రిజల్ట్ రీసౌండ్ వచ్చే రేంజులో వినిపిస్తూనే ఉంది. జైలర్ సినిమాతో రజినీ ఇచ్చిన కంబ్యాక్ తలైవర్ ఫ్యాన్స్ కి నాలుగున్నారేళ్లుగా ఉన్న హిట్ ఆకలి తీరిపోయింది. జైలర్ అండ్ విక్రమ్ సినిమాలతో రజినీ-కమల్ లు ఈ డికేడ్ కే బెస్ట్ కంబ్యాక్స్ ఇచ్చారు. ఈ ఇద్దరి పేర్లని టైం అయిపొయింది ఎప్పుడూ కొట్టిపారేయకూడదు అనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ తిరిగొచ్చేశారు, ముందు ముందు ఈ స్టార్స్ కి పోటీగా యంగ్ హీరోలు నిలబడగలరో లేదో చూడాలి.

Show comments