NTV Telugu Site icon

Kamal Haasan: మా కుటుంబ సభ్యుడును కోల్పోయా.. కమల్ ఎమోషనల్

Siva

Siva

Kamal Haasan: కోలీవుడ్ నటుడు, కమెడియన్ RS శివాజీ నేడు మృతిచెందిన విషయం తెల్సిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక ఆయన మృతిపై పలువురు సినీ, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విశ్వ నటుడు కమల్ హాసన్ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యాడు. శివాజీ, కమల్ మంచి స్నేహితులు. క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా న‌టించిన విక్ర‌మ్‌, స‌త్య‌, అపూర్వ స‌గోద‌ర‌గ‌ళ్‌, మైఖేల్ మ‌ద‌న కామ‌రాజు, గుణ‌, చాచి 420, అన్బేశివంతో లాంటి సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో శివాజీ కమెడియన్ గా మెప్పించాడు. ఇక స్నేహితుడు మరణాన్ని కమల్ జీర్ణించుకోలేకపోయాడు. తమ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయానని కమల్ చెప్పుకొచ్చాడు.

Ustaad Bhagat Singh: ధర్మసంస్థాపన చేయడానికి ఉస్తాద్ వచ్చేశాడోచ్ ..

“నా స్నేహితుడు మరియు గొప్ప క్యారెక్టర్ యాక్టర్ ఆర్.ఎస్. శివాజీ మరణ వార్త విని చాలా బాధపడ్డాను. చిన్న పాత్రే అయినా అభిమానులకు చిరకాలం ఉండేలా ప్రాణం పోసే సత్తా ఆయన సొంతం. అతను మా రాజ్‌కమల్ ఫిల్మ్స్ కుటుంబ సభ్యుడిగా విస్తృతంగా గుర్తింపు పొందాడు. అతనిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను” అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.