ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్, ఎందరో దర్శకుల ఇన్స్పిరేషన్, మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రైడ్ ‘పొన్నియిన్ సెల్వన్’ ఫ్రాంచైజ్ నుంచి పార్ట్ 2 రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా 500 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇతర ఇండస్ట్రీల సినీ అభిమానుల నుంచి ఆశించిన స్థాయి సపోర్ట్ రాకున్నా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ అంటే ఏంటో చూపించింది. మణిరత్నం పాన్ ఇండియా సినిమా తీసే ఇతర దర్శకుల్లా వార్ ఎపిసోడ్స్ కి, గ్రాండియర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఎమోషన్స్ తోనే పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమాని నడిపించాడు మణిరత్నం.
పార్ట్ 2కి మాత్రం ఎమోషన్స్ తో పాటు సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండాలి అప్పుడే ఈ ఫ్రాంచైజ్ తమిళ బౌండరీలు దాటుతుంది. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ ని ఇప్పటికే స్టార్ట్ చేసిన మేకర్స్, మ్యూజిక్ అండ్ ట్రైలర్ లాంచ్ కి రెడీ అయ్యారు. మార్చ్ 29న సాయంత్రం 6 గంటలకి చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్ లాంచ్ జరగనుందనే అనౌన్స్మెంట్ బయటకి వచ్చేసింది. ఈ గ్రాండ్ ఈవెంట్ కి లోకనాయకుడు కమల్ హాసన్ చీఫ్ గెస్టుగా రానున్నాడు. గతంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 మ్యూజిక్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి అటెండ్ అయ్యారు. దీంతో ఆ సినిమాకి సాలిడ్ బజ్ వచ్చింది, ఇప్పుడు రజినీ షూటింగ్ లో బిజీగా ఉండడంతో కమల్ హాసన్ మాత్రమే అటెండ్ అవ్వనున్నాడు. మరి ఇప్పటివరకూ తమిళనాడుకి మాత్రమే పరిమితం అయిన పొన్నియిన్ సెల్వన్ 2 ప్రమోషన్స్, ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత అయినా ఇతర ప్రాంతాలకి వచ్చి సినిమాని ప్రమోట్ చేస్తారేమో చూడాలి.
Are you ready to witness history in the making?#UlagaNayagan @ikamalhaasan sir will grace the #PS2 music and trailer launch!
Nehru Stadium, Chennai at 6PM on 29th March!#CholasAreBack#PonniyinSelvan2 #ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @RedGiantMovies_ pic.twitter.com/2PDXx6eA8C
— Lyca Productions (@LycaProductions) March 27, 2023
