Site icon NTV Telugu

Thug life : కమల్ హాసన్ ’థగ్ లైఫ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..

Thug Life

Thug Life

Thug life : విశ్వనటుడు కమల్ హాసన్-మణిరత్నం కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత మణిరత్నం-కమల్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇందులో శింబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. జూన్ 5న రిలీజ్ అవుతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో కమల్ ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. ఓ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. శింబును చిన్నప్పటి నుంచే కమల్ కాపాడి తన వద్దే పెంచుకుంటాడని ఇందులో చూపించారు.

Read Also : Botsa Satyanarayana: మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది.. ఓపికతో ఉండండి..!

ఇద్దరూ కలిసి గ్యాంగ్ స్టర్లుగా ఎదిగిన తర్వాత శత్రువులుగా మారడం అనే కాన్సెప్టును కూడా ఇందులో చూపించాడు మణిరత్నం. పైగా కమల్ హాసన్ ఇందులో చేసిన యాక్షన్ సీన్లు బాగున్నాయి. వయసు తేడా ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. యాక్షన్ సీన్లలో యంగ్ హీరోల మాదిరిగానే నటించాడు. పైగా ఇందులో త్రిష్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది.

ఇంకో విషయం ఏంటంటే మూవీలో రొమాన్స్ కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ లోనే ఐశ్వర్య లక్ష్మీతో కమల్ లిప్ లాక్ చూపించారు. మొత్తానికి కమల్ హాసన్ వయసుతో సంబంధం లేకుండా యాక్షన్, రొమాన్స్ బాగానే చేసేస్తున్నాడు. ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Read Also : Trivikram: టాలీవుడ్ షేకయ్యే కాంబో సెట్ చేసిన త్రివిక్రమ్?

Exit mobile version