NTV Telugu Site icon

Kamal Haasan: సక్సస్ ని రిపీట్ చేస్తూ ఉండు రజినీ అంటూ కమల్ స్పెషల్ ట్వీట్

Kamal Haasan

Kamal Haasan

డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో తలైవా ట్యాగ్స్ తో హల్చల్ చేస్తున్నారు రజినీ ఫ్యాన్స్. అభిమానులే కాదు ధనుష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కూడా రజినీకాంత్ ని బర్త్ డే విషెష్ చెప్పడంతో సోషల్ మీడియాలో రజినీ పేరు మారుమోగుతుంది. తలైవా ఫ్యాన్స్ లో జోష్ నింపేలా బయటకి వచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్ ట్వీట్. “Happy birthday to my dear friend Superstar rajinikanth. I sincerely wish you to live a happy life reaping success today and forever” అంటూ రజినీకాంత్ కి బర్త్ డే విషెష్ చెప్పాడు కమల్ హాసన్. ఈ ట్వీట్ ని మ్యూచువల్ ఫ్యాన్స్ రీట్వీట్ చేస్తూ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఇద్దరు సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల అభిమానుల మధ్య ఇంత క్లోజ్ ఫ్రెండ్ షిప్ ఉండడం చాలా అరుదు. రజినీకాంత్-కమల్ హాసన్ ల ట్రూ ఫ్రెండ్షిప్ వల్లే ఇది సాధ్యం అయ్యింది

ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా సరే స్టార్ హీరోల మధ్య ప్రొఫెషనల్ రైవల్రీ ఉండడం సర్వసాధారణం. కొత్త హీరోల నుంచి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల వరకూ  రైవల్రీ అనేది చాలా కామన్ విషయం. అయితే తమకి అలాంటివేమీ లేవు, తాము చాలా మంచి ఫ్రెండ్స్ అని ఎప్పటికప్పుడు ఆడియన్స్ ని చెప్తూనే ఉంటారు కమల్ హాసన్-రజినీకాంత్ లు. ఒకరి సినిమాల రికార్డులు ఒకరు బ్రెల్ చేసుకుంటూ మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీగా, పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ హీరోస్ అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్న రజినీ-కమల్ లు కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా మంచి ఫ్రెండ్స్. వీళ్లు కలిసిన ఫోటోలు, వీడియోలు బయటకి వస్తే చాలు అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోతుంది. అంతగా రిలేషన్షిప్ ని ఇన్నేళ్లగా చెక్కు చెదరకుండా మైంటైన్ చేస్తూనే ఉన్నారు రజినీకాంత్ కమల్ హాసన్.