NTV Telugu Site icon

KH 234: సైమా స్టేజ్ పైన… ‘నాయకుడు’ రేంజ్ సినిమా లీక్ ఇచ్చిన కమల్

Kh 234

Kh 234

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న సినిమాల లిస్ట్ తీస్తే అందులో ‘నాయకుడు’ సినిమా టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఇండియా లోనే కాదు ఎన్నో ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ లో ఇప్పటికీ క్లాసులు చెప్పడానికి నాయకుడు సినిమాని ఒక కేస్ స్టడీగా ఉపయోగిస్తారు. ఇండియన్ మూవీ లవర్స్ కి అంత గొప్ప సినిమాని గిఫ్ట్ గా ఇచ్చారు లోకనాయకుడు కమల్ హాసన్ అండ్ మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం. ఈ ఇద్దరూ కలిసి చేసిన ఒక మహాద్భుతం పేరు నాయకుడు. ఇళయరాజా మ్యూజిక్, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ నాయకుడు సినిమాకి ప్రాణం పోశాయి. 1987లో రిలీజ్ అయిన ఈ మూవీని టిల్ డేట్ ఆడియన్స్ చూస్తూనే ఉంటారు. మణిరత్నం తన మూవీ మేకింగ్ టాలెంట్ ని చూపిస్తే… కమల్ హాసన్ ఇలాంటి నటుడు అసలు ఇంకొకడు పుడతాడా అనిపించే రేంజులో పెర్ఫార్మెన్స్ చేసాడు. ఒక గ్యాంగ్ స్టర్ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ ఉండడం అనేది చాలా అరుదు కానీ నాయకుడు సెకండ్ హాఫ్ మొత్తం ఇదే ఎమోషన్ పైన సాగుతుంది. హాలీవుడ్ గాడ్ ఫాదర్ ఇన్స్పిరేషన్ తో తెరకెక్కిన నాయకుడు సినిమా తర్వాత మణిరత్నం, కమల్ మళ్లీ కలిసి పని చేయలేదు. ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి వర్క్ చేస్తే చూడాలని మూవీ లవర్స్ అంతా వెయిట్ చేసారు.

ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తే కమల్ హాసన్-మణిరత్నంలు ఇటీవలే #KH234 సినిమాని అనౌన్స్ చేసారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ ప్రీప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. సైమా ఈవెంట్ లో బెస్ట్ యాక్టర్ తమిళ్ కేటగిరిలో అవార్డ్ గెలుచుకున్న కమల్ హాసన్, ఈ ప్రాజెక్ట్ గురించి చిన్న లీకిచ్చాడు. “నాయకుడు రోజుల్లో ఎలా పని చేసామో, అలానే ఇప్పుడూ వర్క్ చేస్తున్నాం. ఎలాంటి హడావుడి లేకుండా పని చేస్తున్నాం. ఈ మూవీ కోసం గడ్డం పెంచుతున్నాను, ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాను. ఒక మంచి సినిమా చేసి ఆడియన్స్ ని మెప్పిస్తే చాలు అనే ఆలోచనతో కష్టపడుతున్నాం” అని కమల్ చెప్పాడు. ఈ కాన్వర్జేషన్ అంతా లోకేష్ కనగరాజ్, మణిరత్నంలు సైమా వేదికపై ఉండగానే జరగడం విశేషమైతే… అసలు KH234 టాపిక్ ని స్టార్ట్ చేసిందే లోకేష్ కనగరాజ్ కావడం మరింత స్పెషల్ మూమెంట్ అనే చెప్పాలి.

Show comments