NTV Telugu Site icon

Project K: ఓరి బాబో.. రూమర్స్ తోనే చచ్చిపోయేలా ఉన్నాం.. అది నిజమో కాదో చెప్పండయ్యా

Kamal

Kamal

Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె, దిశా పటానీ నటిస్తుండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు ఇప్పటికే ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఇక రోజురోజుకు ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసే రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. ఆ రూమర్స్ వింటుంటేనే .. అభిమానులు హైప్ తో చచ్చిపోయేలా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఎప్పటినుంచో ఈ సినిమాపై వస్తున్న రూమర్ ఏంటంటే.. ఈ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు అని.. ఈ పాత్ర కోసం కమల్.. 10 అంకెల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

Adipurush AI Photos: అవన్నీ గ్రాఫిక్స్ రా.. ఒరిజినల్ అంతేమి లేదిక్కడ

ఒకవేళ ఈ రూమర్ లో కనుక నిజముంటే.. టాలీవుడ్ ఒక్కటే కాదు ఇండస్ట్రీ మొత్తం షేక్ అవ్వడం ఖాయం అని చెప్పాలి. కమల్ నట విశ్వరూపం ఎన్నో సినిమాల్లో చూసాం. అలాంటి నటుడు.. ప్రభాస్ కు ధీటుగా విలనిజాన్ని పండిస్తే థియేటర్ లో ఏ ఒక్క అభిమాని సీటులో కూర్చోడు అంటే అతిశయోక్తి కాదు. ఈ రూమర్ కే అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. చాలామంది అభిమానులు హైప్ తో చచ్చిపోయేలా ఉన్నారు కూడా. కానీ, ఈ రూమర్ పై ఇప్పటివరకు చిత్ర బృందం స్పందించింది లేదు. దీంతో ఈ రూమర్ ను లైట్ తీసుకోవాలా.. ? లేక హైప్ పెంచుకోవాలా ..? అనే డైలమాలో పడిపోయారు. అందుకే ఆ రూమర్ నిజమో కాదో కనీసం చెప్పండయ్యా అని మేకర్స్ ను వేడుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు అయినా మేకర్స్ .. ఈ విషయమై క్లారిటీ ఇస్తే బావుంటుందని నెటిజన్లు కోరుతున్నారు.