NTV Telugu Site icon

Kamal 234: 35 ఏళ్ల తరువాత ‘నాయకుడు’ కాంబో రిపీట్

Kamal

Kamal

Kamal 254: విక్రమ్ సినిమా తర్వాత కమల్ హాసన్ జోరు పెంచేశాడు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇక ఎప్పటినుంచో తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబో కమల్- మణిరత్నం. దాదాపు 35 ఏళ్ళ క్రితం నాయకుడు సినిమాతో ఈ కాంబో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కాంబో ఎప్పుడెప్పుడు రిపీట్ అవుతుందా..? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక నేటితో ఆ కోరిక నెరవేరబోతుంది.

అవును దాదాపు 35 ఏళ్ళ తరువాత ఈ కాంబో రిపీట్ అవుతోంది. నేడు కమల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ తో పాటు రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కమల్ కెరీర్ లో 234 వ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక మరో విశేషమేంటంటే.. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ముగ్గురు లెజెండ్స్ నుంచి వస్తున్న ఈ మూవీపై ఇప్పటినుంచే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తీ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. మరి ఈ కాంబో రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.