లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం కూలి. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతుంది. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇంతటి భారీ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ గా ఉంది.
Also Read : Exclusive : వార్ 2 ఇన్ సైడ్ టాక్.. NTR ఫ్యాన్స్ కాలర్ ఎగరేయచ్చు
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో భారీ ఎత్తున జరిగింది. సూపర్ స్టార్ రజనీ కాంత్, నాగార్జున, ఉపేంద్రతో పాటు ఆమిర్ ఖాన్ సైతం ఈ కార్యక్రమానికి విచ్చేసారు. ఇందరి స్టార్స్ నడుమ కూలీ ట్రేలర్ ను రిలీజ్ చేసారు. గోల్డ్ వాచ్ స్మగ్లింగ్ ప్రధానంగా వస్తున్న కూలీ ట్రైలర్ పై కూడా మిశ్రమ స్పందన వస్తోంది. లోకేష్ కనకరాజ్ నుండి ఇలాంటి ట్రైలర్ ఊహించలేదని కామెంట్స్ వినిపించాయి. కానీ కథ మొత్తం ఇప్పుడే చెప్తే ఏముంటుందని రిలీజ్ వరకు దాచాడు అని లోకి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో సూపర్ సర్ప్రైజ్ ఉందట. లోకేష్ అభిమాన నటుడు కమల్ హాసన్ ఈ సినిమాలో క్యామియోలో కనిపిస్తాడట. నిన్న విడుదలైన ట్రైలర్ లో శృతిహాసన్ ఆయన మీకు ఫ్రెండ్ మాత్రమే కానీ నాకు నాన్న అని చెప్పగా వాడు నా ప్రాణ స్నేహితుడు అని రజనికాంత్ బదులిస్తాడు. ఆ పాత్ర చేసింది కమల్ హాసన్ అట. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్నా కూలీలో విక్రమ్ గా కమల్ హాసన్ గెస్ట్ అపిరియన్స్ ఉంటుందట.
